HanuMan హనుమాన్ బిగ్ సర్ప్రైజ్.. OTTలో కంటే ముందే టీవీలోకి.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
హనుమాన్ ఈ పేరు విన్నా, పలికినా.. ఎంతటి బలహీనుడికైనా తెలియని ఓ శక్తి వచ్చేస్తుంది. ఆయన మన వెంటే ఉన్నాడని భావిస్తే కొండంత బలం పుట్టుకొచ్చేస్తుంది. నిజ జీవితాల్లోనే కాదు సినిమాల్లోనూ ఆయన్నే నమ్మి, ఆయన బ్యాక్ డ్రాప్‌తో ఎన్నో సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ముందు వసూళ్లను కొల్లగొడుతూ హిట్ సాధించాయి. అలా రీసెంట్గా ఈ సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ముందు పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం హనుమాన్. ఈ చిత్రం విడుదలై దాదాపు 50 రోజులు దాటినా ఇంకా క్రేజ్ ఏమాత్రం దక్కలేదు.
అయితే ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుందని అంటున్నారే తప్ప అసలు విడుదల తేదీపై క్లారిటీ రావట్లేదు. కానీ ఇప్పుడీ చిత్రం ఓటీటీ కన్నా ముందే టీవీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అవును మీరు చదివింది నిజం. మరి ఈ చిత్రం ఏ ఛానల్లో, ఎప్పుడు టెలికాస్ట్ కానుందో పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం....

అ!, కల్కి జాంబిరెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రాన్ని కూడా తెరకెక్కించిందీ ఈ కుర్ర దర్శకుడే. సంక్రాంతికి మూడు బడా చిత్రాలు ఉన్నాయని తెలిసి కూడా వెనకడుగు వేయకుండా బరిలో దిగాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నా కథపై నాకున్న నమ్మకం అంటూ తన సినిమాను థియేటర్లలో తనకు దొరికిన తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేశాడు.
తొలి రోజే మొదటి షోకు ఊహించని రెస్పాన్స్ దక్కేసింది. అంతే మౌత్ టాక్‌తో అందరి దృష్టి ఈ సినిమా మీదకే మళ్లింది. దీంతో హనుమాన్తో పాటు వచ్చిన ఇతర బడా చిత్రాలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటినే పక్కనపెట్టి తమ థియేటర్లలో హనుమాన్ను ప్రదర్శితం చేయడం మొదలుపెట్టారు నిర్వాహకులు. అలా దాదాపు రూ.30 కోట్లలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్‌లో దాదాపు రూ. 250కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలన సృష్టించింది. నార్త్‌లోనూ భారీ రెస్ఫాన్స్ను అందుకుంది. ఇప్పటికీ అక్కడక్కడా హౌస్ ఫుల్తో ఆడుతున్నట్లు సమాచారం అందుతూనే ఉంది.

దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అందరూ చాలా రోజులుగా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి చూడాలని ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. కానీ ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.. జీ5లో అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తందని అంటున్నారు. కానీ రావట్లేదు. ఫైనల్‌గా మార్చి 8 నుంచి వస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ శివరాత్రి రోజు కూడా ఈ చిత్రం హ్యాండ్ ఇచ్చింది. దీనిపై జీ5 కూడా స్పందించింది. హనుమాన్ ఓటీటీపై మాకే ఇంకా సరైన సమాచారం రాలేదు. అందుకే దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరిన్ని అప్‌డేట్స్‌కు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి అంటూ రాసుకొచ్చింది.
అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ కన్నా ముందే టీవీలోకి వచ్చేస్తున్నట్లు తెలిసింది. అయితే తెలుగులో కాదు. హిందీ వెర్షన్లో. ఈ చిత్ర హిందీ వెర్షన్ ప్రీమియర్స్ కలర్స్ సినీప్లెక్స్‌లో మార్చి 16న సాయంత్రం 8 గంటలకు ప్రసారం కానుందని సమాచారం అందింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. కాగా ఈ చిత్రంలో తేజ సజ్జా హనుమంతుగా మెప్పించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, అమృత అయ్యర్, సముద్రఖని, వినయ్‌రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కూడా నటించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











