twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Kapil Sharma.. టెలిఫోన్ బూత్‌‌లో పని నుంచి ఫోర్బ్స్ వరకు.. దారుణమైన కష్టాలు..

    |

    దేశంలో టాప్ కామెడీ షో ఏదైనా ఉందంటే.. అది కామెడీ నైట్స్ విత్ కపిల్. హీరో, హీరోయిన్లపై సెటైర్లు వేస్తూ.. ప్రేక్షకులను ఆటపట్టిస్తూ సరదాగా సాగే ఈ షోకు కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అత్యంత ప్రజాదరణ ఉంది. కపిల్ పేరు చెప్పగానే బుల్లితెర ప్రేక్షకుల పెదవి మీద చిరునవ్వు పాకుతుందంటే అతనిలో ఉండే సమయస్పూర్తే కారణమంటారు. అలాంటి కమెడియన్ కపిల్ దారుణమైన ఆర్థిక పరిస్థితుల నుంచి ఫోర్బ్స్ జాబితాలో చేరిన ధనవంతుడిగా రికార్డులెక్కారు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన కపిల్ జన్మదినం ఏప్రిల్ 2. ఈ సందర్భంగా కపిల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. జీవితంలోని ముఖ్యాంశాలు మీకోసం.

    బాల్యంలో కష్టాలు

    బాల్యంలో కష్టాలు

    అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మ అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. జీవితపు తొలినాళ్లలో దారుణమైన ఆర్థిక కష్టాలను అనుభవించారు. చిన్నతనంలో తండ్రి మద్యం వ్యసనానికి అలవాటు పడి మరణించడంతో కుటుంబ బాధ్యతలు కపిల్‌పై పడ్డాయి. దాంతో చదువుకుంటూనే సంపాదించే పనిలో పడ్డారు. థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కు పాఠాలు కూడా చెప్పారు.

    నాన్న తాగుడుకు అలవాటు పడి

    నాన్న తాగుడుకు అలవాటు పడి

    కపిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్కూల్ డేస్‌లో చదువుకోవడానికి టెలిఫోన్ డబ్బాలో కూడా పనిచేశాను. మా నాన్న సంపాదించినదంతా తాగుడుకూ ఖర్చు చేయడం, దాంతో ఆయన ఆరోగ్య క్షీణించింది. ఓ సందర్భంలో మా నాన్నను దారుణం తిట్టే వాడిని. కానీ ఇప్పుడు మా నాన్నను తలుచుకొంటే ఆయన లేని లోటు గుర్తుకు వస్తుంది అని కపిల్ భావోద్వేగానికి లోనయ్యారు.

     కాలేజ్ డేస్‌లో టెలిఫోన్ బూత్‌లో

    కాలేజ్ డేస్‌లో టెలిఫోన్ బూత్‌లో

    కాలేజ్ డేస్‌లో నేను చేసే కామెడీకి అందరూ నవ్వేవాళ్లు. ఆ సమయంలో ఓ కామెడీ షో కోసం ఆడిషన్స్‌కు వెళితే రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నా కామెడీ షోలో పనివాడిగా నటించే రాజు సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించడంతో 2007లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు తిరుగు లేకుండా పోయింది.

    సింగర్‌ కావాలనే కలతో

    సింగర్‌ కావాలనే కలతో

    వాస్తవానికి నాకు పాడటం అంటే ఇష్టం. సింగర్ కావాలనుకొని ముంబై వచ్చాను. ఆ తర్వాత కామెడీ సర్కస్ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత సొంతంగా కామెడీ నైట్స్ విత్ కపిల్ షోను ప్రారంభించాను. దాంతో నాకు మంచి ప్రజాదరణ దక్కింది. దాంతో కపిల్ సెలబ్రిటీగా మారిపోయారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో అతి సామాన్యుడు అత్యంత సంపన్నుడిగా మారారనే కథనాన్ని వెల్లడించడం విశేషం. ఫోర్స్స్ జాబితాలో 11, 18 స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం టాప్ 100 మంది జాబితాలో ఒకరు కావడం విశేషం.

    సునీల్ గ్రోవర్ వివాదాలతో..

    సునీల్ గ్రోవర్ వివాదాలతో..

    అయితే కెరీర్ సవ్యంగా సాగిపోతుందునుకునే సమయంలో తన షోలో పనిచేసే సునీల్ గ్రోవర్‌తో విమాన ప్రయాణంలో గొడవ కావడం, ఆ తర్వాత కలర్స్ ఛానెల్ నుంచి కామెడీ నైట్స్ విత్ కపిల్ తొలగించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత మరో జాతీయ ఛానెల్‌లో మరో కామెడీ నైట్స్ షోను ప్రారంభించి మళ్లీ గత వైభవాన్ని సొంతం చేసుకొన్నారు.

    Recommended Video

    Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
    బాలీవుడ్ ఎంట్రీతో

    బాలీవుడ్ ఎంట్రీతో

    టెలివిజన్‌లో కామెడీ షోను కంటిన్యూ చేస్తూనే బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2015లో కిస్ కిస్కో ప్యార్ కరూ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఆశించినంతగా ఆ సినిమాకు ప్రజాదరణ దక్కకపోవడంతో బుల్లితెరకే పరిమితమయ్యారు.

    English summary
    Happy Birthday Kapil Sharma: Kapil Sharma is the top most comedian in the Indian television. His Journey from PCO to Forbes list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X