For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెర కపుల్స్ సీక్రెట్స్: వీళ్ల మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా?.. వాళ్లేమంటున్నారంటే!

  |

  సాధారణంగా సినీ రంగంలో ఉన్న నటీనటుల మధ్య ప్రేమాయణం సాగుతుందని ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో కంటే బుల్లితెర ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి కహానీలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా జంటలు ఎనలేని క్రేజ్‌ను అందుకుని భారీ స్థాయిలో పాపులర్ అవుతున్నాయి. ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఆర్టిస్టులు డేటింగ్ వ్యవహారాలతో ఫేమస్ అయ్యారు. కానీ, తమ మధ్య స్నేహమే ఉందని వాళ్లంటున్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ జంటల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి!

  బుల్లితెరపై ఫస్ట్ చెప్పుకోవాల్సింది వీళ్లే

  బుల్లితెరపై ఫస్ట్ చెప్పుకోవాల్సింది వీళ్లే

  జబర్ధస్త్ అనే షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఆమెతో పాటే ఈ షోతో కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా పాపులర్ అయ్యాడు. ఇక, ఈ షోలో కలుసుకున్న వీళ్లిద్దరూ జంటగా మారారు. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు. కానీ, నిజ జీవితంలో మాత్రం స్నేహితులుగానే ఉంటున్నారు.

  శృతి మించిన జబర్ధస్త్ వర్ష గ్లామర్ ట్రీట్: లోదుస్తులతో ఘాటు ఫోజులు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

  కొత్తగా వచ్చిన జంట... సెంటిమెంట్‌తో

  కొత్తగా వచ్చిన జంట... సెంటిమెంట్‌తో

  ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో బాగా హైలైట్ అవుతోన్న వారిలో ఇమాన్యూయేల్ - వర్ష జంట ఒకటి. రష్మీ సుధీర్ తర్వాత వీళ్లిద్దరిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నిర్వహకులు. ఈ క్రమంలోనే రొమాంటిక్ డ్యాన్స్‌లు, కిస్సులు, హగ్గులు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ ఆర్టిస్టుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ, రియల్‌గా వీళ్లు స్నేహితులు మాత్రమే.

  బుల్లితెర హీరో.. హీరోయిన్ల లవ్ ట్రాకు

  బుల్లితెర హీరో.. హీరోయిన్ల లవ్ ట్రాకు

  బుల్లితెరపై వచ్చే షోలు మాత్రమే కాదు.. సీరియల్ నటీనటుల మధ్య కూడా లవ్ ట్రాకులు ఉంటాయని ఈ మధ్య టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం రవికృష్ణ.. నవ్య స్వామి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు రావడమే. ఆ మధ్య ఓ షోలో కలిసి పని చేసిన వీళ్లిద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, వీళ్లు మాత్రం తాము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు.

  హాట్ ఫొటోలతో యాంకర్ విష్ణుప్రియ రచ్చ: ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయిన బ్యూటీ

  అప్పుడు హౌస్‌లో... ఇప్పుడు నెట్‌లో

  అప్పుడు హౌస్‌లో... ఇప్పుడు నెట్‌లో

  ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సినీ నటి పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగించినట్లు కనిపించాడు. దీంతో వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటున్నారని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ప్రముఖ నటి, యాంకర్ అషు రెడ్డితో రిలేషన్‌లో ఉన్నానని చెప్పాడు. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని తర్వాత తెలిసింది.

  సుడిగాలి సుధీర్‌తో ఆ యాంకర్ ట్రాక్

  సుడిగాలి సుధీర్‌తో ఆ యాంకర్ ట్రాక్

  కెరీర్ ఆరంభంలోనే సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ‘పోవే పోరా' షో చేస్తున్న సమయంలో అతడు.. యాంకర్ విష్ణుప్రియతో డేటింగ్ చేస్తున్నాడనే టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఓ సందర్భంలో విష్ణుప్రియ.. సుధీర్ తనకు స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చేసింది.

  హైపర్ ఆది.... వర్షిణి ఓ ప్రేమ కహానీ

  హైపర్ ఆది.... వర్షిణి ఓ ప్రేమ కహానీ

  ‘ఢీ' షోలో మెంటర్లుగా చేస్తున్న సమయంలో హైపర్ ఆది.. వర్షిణి సౌందరాజన్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు కనిపించింది. ఈ జంటను నిర్వహకులు బాగా హైలైట్ చేయడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే, ఇదంతా కేవలం షోల కోసమేనని ఇద్దరూ స్పష్టం చేశారు. ఆమె ఆ షోలో చేయడం మానేసిన తర్వాత ఎప్పుడూ కలుసుకున్నట్లు మాత్రం కనిపించనే లేదు.

  Evaru Meelo Koteeswarulu నుంచి ఊహించని ప్రకటన: తారక్ డైలాగ్స్ కేక.. ప్రోమోనే ఇలా ఉంటే షో ఎలా!

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  మరికొన్ని జంటలు.. ఓన్లీ షో కోసమే

  మరికొన్ని జంటలు.. ఓన్లీ షో కోసమే

  బుల్లితెరపై మరికొన్ని జంటలు కూడా చాలా సందడి చేశాయి. అషు రెడ్డి - ఎక్స్‌ప్రెస్ హరి, శ్రీముఖి - ప్రదీప్ ఇలా చాలా మంది జోడీలుగా మారుతున్నారు. అయితే, ఇవి కేవలం షోల టీఆర్పీ రేటింగ్‌ను పెంచేందుకు మాత్రమే. నిజానికి బుల్లితెరపై కొందరు నిజంగానే ప్రేమలో ఉన్నప్పటికీ.. వాళ్లు బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. దీంతో ఎవరు రియల్? ఎవరు రీల్ అర్థం కావట్లేదు.

  English summary
  So Many Love Birds in Telugu Television Industry. On The Occasion of Friendship Day Let We Know abour These Relationships.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X