Bigg Boss Voting: ఊహించని ఎలిమినేషన్‌?..ఈ వీక్‌తో కన్నడ కంచుకోట బద్దలేనా?

బిగ్‌బాస్ తెలుగు 8 మరి కొద్దిగంటల్లో 10వ వారం పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగుపెట్టనుంది. మరి నాలుగైదు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ ముగియనుంది. దీంతో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నామినేషన్స్‌లో ఉన్న వారిలో 10వ వారం హౌస్‌ను ఎవరు వీడబోతున్నారు? ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ వారానికి గాను ప్రేరణ మెగా చీఫ్ అయ్యారు. అదే సమయంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి బిగ్‌బాస్ అనౌన్స్ చేశారు. దీని సాయంతో హౌస్ నుంచి ఎలిమినేట్ కాకుండా సేవ్ కావొచ్చని చెబుతాడు.. మీ ఫోటోలతో ఉన్న గోల్డెన్ ఎగ్స్‌ని పాము తినేస్తుందని, ఎవరి ఎగ్స్ అయితే మిగిలి ఉంటాయో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని బిగ్‌బాస్ రూల్ చెబుతాడు. ఇక్కడే మరో ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్. ఎవరికైతే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రాకూడదని అనుకుంటున్నారో ఐదుగురి ఎగ్స్‌ని పాము నోట్లో వేయమని ప్రేరణను ఆదేశిస్తాడు బిగ్‌బాస్. దీంతో ఆమె విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజల గుడ్లను పాము నోట్లో వేసింది ప్రేరణ.

hari teja and Prithviraj Shetty in Danger zone in bigg boss telugu 8 in 10th week

తర్వాత నబీల్ - అవినాష్ కలిసి యష్మి గుడ్డును పాము నోట్లో వేశారు. తర్వాత నిఖిల్ - గౌతమ్‌లు కలిసి టేస్టీ తేజ గుడ్డును పాము నోట్లో వేసేశారు. అనంతరం విష్ణుప్రియ - పృథ్వీలు కలిసి ప్రేరణ గుడ్డును పాము నోట్లో వేశారు. రోహిణి - హరితేజలు అవినాష్ గుడ్డుని వేసేశారు. చివరికి నబీల్, నిఖిల్, రోహిణి ఎగ్స్ మాత్రం మిగలగా.. యష్మి రోహిణి గుడ్డుని, తేజ నిఖిల్ గుడ్డుని లోపలికి వేశారు. అందరి గుడ్లు పోగా.. చివరికి నబీల్ గుడ్డు మాత్రమే మిగలగా మనోడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది.

ఇక పదవ వారం గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీలు నామినేషన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. కన్నడ బ్యాచ్‌కి ముచ్చెమటలు పట్టిస్తూ 27 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. 26.07 శాతం ఓటింగ్‌తో నిఖిల్‌ అతనికి గట్టి పోటీ ఇస్తూ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

hari teja and Prithviraj Shetty in Danger zone in bigg boss telugu 8 in 10th week

అనంతరం ప్రేరణ (17. శాతం), యష్మిగౌడ (16.32 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ (11 శాతం ), పృథ్వీ (9 శాతం) , హరితేజ (6 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి హరితేజ ఈ వారం ఎలిమినేట్ అవుతారట. అయితే మరికొందరు మాత్రం పృథ్వీకి కూడా ఛాన్సులు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేక డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇస్తాడా అనేది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X