బిగ్ బాస్ చేసిన తప్పుకు కంటెస్టెంట్లు బలి: ఫినాలేకు ముందు బుక్కైపోయిన ఐదుగురు సభ్యులు

ఇన్ని రోజులు గొడవలు, కొట్లాటలు, కోల్డ్ వార్‌లతో రచ్చ రచ్చగా సాగింది బిగ్ బాస్ నాలుగో సీజన్. అయితే, ప్రస్తుతం షో ఫినాలే వీక్‌కు చేరుకోవడంతో ఇంట్లోని కంటెస్టెంట్లు అంతా ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉన్నన్ని రోజులైనా గొడవలు లేకుండా మంచిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు ప్రేమను చూపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం జరిగింది. నిర్వహకులు చేసిన తప్పుకు కంటెస్టెంట్లను బలి చేసేశారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఆట పాటలతో సాగుతున్న ఐదుగురు

ఆట పాటలతో సాగుతున్న ఐదుగురు

బిగ్ బాస్ నాలుగో సీజన్ మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ షో.. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేను జరుపుకోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు ఆట పాటలతో సాగిపోతున్నారు. బిగ్ బాస్ కూడా వాళ్లు సరదాగా గడిపేలానే టాస్కులు ఇస్తుండడంతో ఈ రియాలిటీ షో నవ్వులతో సాగిపోతోంది.

విన్నర్ కోసం కుస్తీ పడుతోన్న ఫ్యాన్స్

విన్నర్ కోసం కుస్తీ పడుతోన్న ఫ్యాన్స్

ఇంట్లో పరిస్థితి అలా ఉంటే.. బయట మాత్రం తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు ప్రేక్షకులు ప్రతిరోజూ ఓట్లు వేస్తున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా తమ అభిమాన కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతూ ఓట్లు వేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి.

వాళ్ల కోసం వస్తున్న సినీ ప్రముఖులు

వాళ్ల కోసం వస్తున్న సినీ ప్రముఖులు

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్, ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దేత్తడి హారిక ఫైనలిస్టులుగా ఉన్నారు. వీరి గెలుపు కోసం ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో శ్రమ పడుతున్నారు. అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులు సైతం తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ప్రచారం కూడా చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు

బిగ్ బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఫినాలే వీక్ నడుస్తోంది. దీంతో నిర్వహకులు సరికొత్త ఫ్లాన్లు చేస్తున్నారు. ఈ వారం మొత్తం టాస్కులు ఉండవు కాబట్టి.. కొన్ని సర్‌ప్రైజ్‌లను మాత్రం తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి సీజన్ కంటెస్టెంట్ హరి తేజ, రెండో సీజన్ నుంచి గీతా మాధురి, మూడో సీజన్ కంటెస్టెంట్లు శ్రీముఖి, అలీ రేజా ఎంట్రీ ఇచ్చారు.

ఆటపై సలహాలు, సూచనలు ఇచ్చారు

ఆటపై సలహాలు, సూచనలు ఇచ్చారు

కరోనా నిబంధనల కారణంగా హౌస్‌లోకి వెళ్లని వీళ్లంతా.. మానిటర్ ద్వారా కంటెస్టెంట్లతో ముఖాముఖీ మాట్లాడారు. ఇందులో భాగంగానే ఒక్కో కంటెస్టెంట్ ఆట తీరుపై తమకు కలిగిన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, ఫినాలే వీక్‌లో ఎలా ఉండాలి? ఎలాంటి ఆట ఆడాలి? టెన్షన్‌ను ఎలా అధిగమించాలి? అనే విషయాలపై వాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

బిగ్ బాస్ చేసిన తప్పుకు కంటెస్టెంట్లు బలి

బిగ్ బాస్ చేసిన తప్పుకు కంటెస్టెంట్లు బలి

షోలోకి అడుగు పెట్టిన సమయం నుంచే హరి తేజ, శ్రీముఖి, గీతా మాధురి, అలీ రేజాలు ప్రస్తుత కంటెస్టెంట్లపై కుల్లును వెళ్లగక్కారు. తాము పాల్గొన్న సీజన్‌లో వసతులు మంచిగా లేవని, ఆహారం సరైన టైమ్‌కు వచ్చేది కాదని, ఇంట్లో మిక్సీలు వగైరా ఉండేవి కాదని, సెట్ కూడా ఇంత అందంగా లేదని తమ బాధలు చెప్పుకున్నారు. ఇలా.. ప్రస్తుత కంటెస్టెంట్లపై సరదాగా కోప్పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X