Bigg Boss Voting : దారుణంగా ఓటింగ్ .. ఆ కంటెస్టెంట్‌కు డేంజర్ బెల్స్, పెట్టే బేడా సర్దాల్సిందే?
బిగ్‌బాస్ తెలుగు 8 ఉత్కంఠగా సాగుతోంది. గత వారం నయని పావని ఎలిమినేట్ కాగా.. 10వ వారం ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు .. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈసారి కన్నడ బ్యాచ్ మొత్తం నామినేషన్స్‌లో ఉండగా.. ఈ గ్రూప్‌లో ఫస్ట్ వికెట్ పడుతుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే :
నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో మెగా చీఫ్ కంటెండర్స్ ఎంపికపై బిగ్‌బాస్ దృష్టి సారించాడు. నిన్న గౌతమ్, నబీల్, హరితేజ, రోహిణిలు మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం పోటీపడ్డారు. బుధవారం పృథ్వీకి కీని పట్టు కంటెండర్ షిప్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం .. అన్ని రకాల అడ్డంకులను దాటుకుని కీస్ దక్కించుకుని కంటెండర్‌షిప్ బోర్డు పట్టుకోవాలి. ఈ గేమ్‌కి యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే ఈ టాస్క్‌లో ఎవరితో తలపడాలని అనుకుంటున్నారో మీరే తేల్చుకోవాలని పృథ్వీకే నిర్ణయాధికారం వదిలేస్తాడు బిగ్‌బాస్. దీంతో విష్ణుప్రియ అయితే బాగుంటుందని ఆమెను ప్రత్యర్ధిగా ఎంపిక చేసుకున్నాడు.

విష్ణు తొలి బ్రీఫ్ కేస్ వెతికి పట్టుకున్నా.. పృథ్వీ తెలివిగా గేమ్ ఆడి టాస్క్‌లో గెలిచాడు. అతను బ్రీఫ్ కేస్ తెరిచిచూడగా.. అందులో రూ.99 వేలు కనిపించాయి. ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీకి యాడ్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. తర్వాత ఆరెంజ్ కలర్ బ్రీఫ్ కేస్ సాధించిన విష్ణుప్రియ , యష్మి, ప్రేరణలకు బిగ్‌బాస్ బరువైన సంచి అనే ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కి హరితేజ సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో విష్ణుప్రియకు గట్టి పోటీ ఇచ్చిన ప్రేరణ గెలిచింది.
తర్వాత ఆమె బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయగా అందులో రూ. లక్ష ఉన్నాయి.. దీంతో గార్డెన్ ఏరియాలో ఉన్న మరో బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయమని ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందరి కోరిక మేరకు ప్రేరణ దానిని ఓపెన్ చేయగా.. అందులో ఏకంగా రూ. 2 లక్షల 12 వేలు ఉంటాయి. అంటే మొత్తంగా అందరికంటే ఎక్కువగా రూ. 3 లక్షల 12 వేలను ప్రైజ్‌మనీకి యాడ్ చేసింది ప్రేరణ. తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన కేకుకు ఆశ పెట్టి నిఖిల్ - యష్మి - గౌతమ్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని టేస్టీ తేజ చెప్పాడు.

ఇక పదవ వారం గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీలు నామినేషన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. 26 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. తర్వాత 25.03 శాతం ఓటింగ్‌తో నిఖిల్ అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. అనంతరం ప్రేరణ (17.63 శాతం), యష్మిగౌడ (16 శాతం) ఓటింగ్‌తో ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ (11.07 శాతం ), పృథ్వీ (9.28 శాతం) , హరితేజ (6.13 శాతం), ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నాడు. అందరిలోకి హరితేజ ఓటిం


Click it and Unblock the Notifications











