Bigg Boss Telugu 8 Voting : 10వ వారం ఖరారైన ఎలిమినేషన్ .. మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఔట్?
బిగ్‌బాస్ తెలుగు 8 మరో వీకెండ్‌కు దగ్గరైంది. ఇప్పటి వరకు 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ మెగా షో, ఈ వారంతో పదో వారాన్ని కూడా కంప్లీట్ చేసుకోనుంది. మరో ఆరేడు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 ముగియనుంది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. అంతా స్ట్రాంగ్ ప్లేయర్సే. మరి వీరిలో 10వ వారం హౌస్‌ను ఎవరు వీడబోతున్నారు? ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే :
ప్రస్తుతం హౌస్‌లో మెగా చీఫ్ కంటెండర్ కోసం బిగ్‌బాస్ టాస్క్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే. చివరి చీఫ్ కంటెండర్ అయ్యేందుకు విష్ణుప్రియ - యష్మికి ఓ టాస్క్ ఇవ్వగా ఇందులో యష్మి గెలిచి చీఫ్ కంటెండర్‌గా నిలిచింది. అనంతరం బ్రీఫ్‌కేస్ ఓపెన్ చేయగా.. అందులో రూ. 75 వేలు ఉంటాయి. ఆ మొత్తాన్ని ప్రైజ్‌మనీకి యాడ్ చేస్తారు బిగ్‌బాస్. అయితే విష్ణుప్రియ బ్రీఫ్ కేస్ అనుకుని యష్మిది లేపేస్తాడు అవినాష్. తర్వాత కంటెస్టెంట్స్ అంతా విషయం తెలుసుకుని ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయగా అందులో రూ. లక్షా 80 వేలు ఉండటంతో అంతా అవినాష్‌కి చీవాట్లు పెడతారు.

తర్వాత అవినాష్, రోహిణిలకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌లో మీరిద్దరూ ఆడిషన్ చేసి నవ్వించాలని టాస్క్ ఇచ్చాడు. దాంతో అవినాష్ రెచ్చిపోయాడు. యష్మి - నిఖిల్- గౌతమ్‌లతో తాను ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీస్తున్నానని.. దీనికి ముగ్గురు కావాలని చెప్పి వారిని పిలుస్తాడు. యష్మీని గౌతమ్ అక్కా అని పిలిచిన సీన్‌ని రీక్రియేట్ చేసి నవ్వించాడు అవినాష్ . తనకి ఇష్టం లేనప్పుడు అక్కా అని పిలవొద్దని నిఖిల్ మధ్యలో అందుకోగా.. నేను పిలవను నువ్వు పిలుస్తావా అని గౌతమ్ అనడంతో నిఖిల్ షాక్‌లో ఉండిపోయి ముసి ముసి నవ్వులు నవ్వాడు.
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8లో 10వ హౌస్‌కి మెగా చీఫ్‌గా ప్రేరణ గెలిచినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు ఈ సీజన్‌కు గాను ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచేందుకు బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ ఇచ్చిన పవర్‌తో మెగా చీఫ్ అయిన ప్రేరణ.. ఐదుగురు కంటెస్టెంట్స్‌ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లలో పోటీ పడకుండా తప్పించిందట. వారు విష్ణుప్రియ, గౌతమ్, హరితేజ, గంగవ్వ, పృథ్వీ. మరి ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

ఇక పదవ వారం గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీలు నామినేషన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. 26.35 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. 26.07 శాతం ఓటింగ్‌తో నిఖిల్ అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. అనంతరం ప్రేరణ (18.82 శాతం), యష్మిగౌడ (16.41 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ (11 శాతం ), పృథ్వీ (10.72 శాతం) , హరితేజ (6 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి హరితేజ ఈ వారం ఎలిమినేట్ అవుతారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











