అఖిల్‌, మెహబూబ్‌కు దేత్తడి.. కన్నుకొట్టేసి.. సైగలు చేసిన హారిక..

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో కెప్టెన్సీ టాస్క్ కోసం నిర్వహించిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో హారిక తన చిలిపి చేష్టలతో ఆకట్టుకొన్నారు. పల్లెకు పోదాం ఛలో ఛలో గేమ్ సందర్భంగా అల్లరి పిల్లగా నటించే అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఆమెకు బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో ఇక రెచ్చిపోయింది. సీక్రెట్ టాస్క్ కోసం హారిక ఎలాంటి కసరత్తులు చేసిందంటే..

అల్లరి పిల్లగా.. సీక్రెట్ టాస్క్‌తో

అల్లరి పిల్లగా.. సీక్రెట్ టాస్క్‌తో

టాస్క్ ఆరంభానికి ముందు కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అల్లరి పిల్ల పాత్రను పోషించాలి. ఇంటి సభ్యులందరికి హెల్ప్ చేయాలి. అలాగే సీక్రెట్ టాస్క్ కూడా ఆడాలని చెప్పాడు. అమ్మా రాజశేఖర్‌పై కాఫి చల్లడం, అవినాష్‌కు కోపం తెప్పించడం, ఏదైనా చోట తను చంపే వ్యక్తి పేరు రాయడం లాంటి చేయాలని సూచించాడు.

కొంటె పిల్లగా ఆటపట్టిస్తూ..

కొంటె పిల్లగా ఆటపట్టిస్తూ..

ఇక ఇంటిలో కొంటె పిల్లగా అందర్నీ ఆటపట్టించింది. గ్రామంలో శ్రీనుగా రౌడీ పాత్రలో నటించిన మెహబూబ్‌తో లవ్ ట్రాక్‌ను నడిపించింది. మెహబూబ్‌తో సున్నితమైన రొమాన్స్ చేస్తూనే హారిక తన మిగితా పనులపై దృష్టిపెట్టింది. మెహబూబ్‌తో కలిసి ఇంట్లో అల్లరి, చిలిపి పనులు చేస్తూ కనిపించింది.

మెహబూబ్, అఖిల్‌తో లవ్ ట్రాక్

మెహబూబ్, అఖిల్‌తో లవ్ ట్రాక్


ఇక మెహబూబ్‌తో లవ్ గేమ్‌ను కొనసాగిస్తూనే.. గ్రామపెద్ద బావమరిగా నటిస్తున్న అఖిల్‌ను ముగ్గులోకి లాగేందుకు ప్రయత్నించింది. కన్ను కొడుతూ .. అక్కడికి రా అంటూ సైగలు చేసింది. హారిక తీరు చూసి అభిజిత్ విస్తుపోయాడు. మెహబూబ్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తుందని అఖిల్‌కు హెచ్చరించారు. అలాగే కన్నుకొట్టిన విషయాన్ని మెహబూబ్‌కు చెప్పి హారికపై ఫిర్యాదు చేశాడు.

అమ్మా రాజశేఖర్‌ను హత్య చేసిన హారిక

అమ్మా రాజశేఖర్‌ను హత్య చేసిన హారిక

ఇక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అమ్మా రాజశేఖర్‌ను చంపేందుకు కాఫీ కప్పుతో సిద్ధమైంది. బిగ్‌బాస్ ఆదేశాలు రాగానే హంతకురాలిగా మారేందుకు సిద్ధమైంది. అదే సమయంలో అవినాష్ నిర్వహించే పాన్ షాప్ వద్ద అఖిల్‌తో జరిగిన గొడవను ఛాన్స్‌గా తీసుకొని మాస్టర్‌పై కాఫీ పోసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే.. సారీ మాస్టర్ అంటూ కబుర్లు చెప్పింది. టిష్యూ తెచ్చి తుడవడానికి ప్రయత్నించింది.

సీక్రెట్ టాస్క్‌లో సక్సెస్‌గా!

సీక్రెట్ టాస్క్‌లో సక్సెస్‌గా!

ఇక బిగ్‌బాస్ అప్పగించిన టాస్క్‌లో ఇంకా రెండు పనులు మిగిలే ఉన్నాయి. అవినాష్‌కు కోపం తెప్పించడం.. మరో వ్యక్తిని చంపేందుకు హారిక గోడపై ఆ వ్యక్తి పేరు రాయడం మిగిలి ఉన్నాయి. అయితే తాజా వార్తల ప్రకారం హారిక తనకు బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో సఫలమైనట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X