కొంటెగా కౌగిలించుకొన్నా.. 100 శాతం కరెక్టే.. అవినాష్‌కు హారిక దేత్తడి
బిగ్‌బాస్ ఇంటిలో 51వ రోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ సందర్భంగా గత వారం జరిగిన కొంటె రాక్షసులు టాస్క్ మీద హారిక, అవినాష్ మధ్య హాట్ హాట్‌గా డిస్కషన్ జరిగింది. హారికను అవినాష్ నామినేట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సందర్భంగా హారిక, అవినాష్ మధ్య కౌంటర్, ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చ ఏమిటంటే..

కెప్టెన్సీ టాస్క్ కోసం సరిగా ఆడలేదు
కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన కొంటె రాక్షసులు టాస్క్‌లో హారిక సరిగా ఆడలేదు. బంతిపూల టాస్క్, క్లే గేమ్‌లో సరిగా వ్యవహరించలేదు. ఎదుటి టీమ్‌ను డిఫెండ్ చేయలేకపోయారు. టాస్క్‌లో కొంత బెటర్‌గానే ఆడినప్పటికి.. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేదు అంటూ హారికను ఉద్దేశించి అవినాష్ కామెంట్ చేశాడు. ఆతర్వాత ఆమెను నామినేట్ చేశాడు.

అవినాష్‌కు హారిక క్లారిటీ
నేను కొంటె రాక్షసులు గేమ్‌లో నేను సరిగా ఆడలేదా? అంటూ నోయల్, లాస్య, అఖిల్ అందరితో అడిగి చేసిందనిపించింది. 100 శాతం పనిచేయలేదంటే ఒప్పుకోను అంటూ అవినాష్‌కు హారిక క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు.. ఇంటి సభ్యులందరూ మధ్య జరిగిన డిస్కషన్‌ను మాత్రమే నేను చెప్పాను అంటూ హారికకు అవినాష్ క్లారిటీ ఇచ్చాడు.

కొంటెగా లాస్యను కౌగిలించుకొన్నా
కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడే సమయంలో తాను సరిగా ఆడలేదని అవినాష్ చేసిన కామెంట్‌పై హారిక దేత్తడి ఘాటుగా స్పందించారు. కొంటే రాక్షసుల టాస్క్‌లో నేను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. దండలు చేసే సమయంలో కొంటేగా వ్యవహరించాలంటే.. నేను కొంటెగా వ్యవహరిస్తూ లాస్య అక్కను కౌగిలించుకొన్నాను అంటూ అవినాష్‌కు హారిక క్లారిటీ ఇచ్చారు.

అరియానాపై హారిక ఎటాక్
8వ వారం ఎలిమినేషన్ జరిగిన ప్రక్రియలో హారిక పాల్గొంటూ.. అరియానాను నామినేట్ చేసింది. టాస్క్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నీ పాయింట్ వ్యూనే చెప్పాలనుకొంటావు. ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వవు. వారి అభిప్రాయాన్ని చెప్పనివ్వవు. అదే నీ వద్ద ఉన్న ప్రాబ్లెం. ఎదుటి వాళ్లు చెప్పేలోపే అక్కడి నుంచి వెళ్లిపోతావు. ఎదుటివాళ్లు ఏం చెప్పాలనుకొంటున్నారో వింటే బాగుంటుంది అని అరియానాకు హారిక సూచించింది. ఆ తర్వాత ఆమెను నామినేట్ చేసింది.
Recommended Video

మెహబూబ్ నీపై ఎన్నో ప్రశ్నలు
ఇక మరోకరి నామినేట్ చేయాలి కాబట్టి.. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలనుకొంటున్నాను. నా దృష్టిలో మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇంటిలో తన మీద కొన్ని పశ్నలకు సమాధానం దొరకడం లేదు. వాటికి సరైన జవాబు ఇచ్చేలా వ్యవహరిస్తావనుకొంటున్నాను. కొన్ని సమస్యలపై క్లారిటీ ఇవ్వాలనుకోరుకొంటున్నాను. నీవు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఈ నామినేషన్ వల్ల నీకు ఎలాంటి ముప్పు రావొద్దని భావిస్తున్నాను అని అరియానా చెప్పారు.


Click it and Unblock the Notifications











