Bigg Boss Telugu Unseen హారిక ఇదేం పని.. బెడ్‌పై గట్టిగా వాటేసుకొని.. మోనాల్‌తో అలా?
బిగ్‌బాస్ తెలుగు షోలో 8వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటిలో గందరగోళం నెలకొన్నది. ఇంటిలో మెహబూబ్, అమ్మా రాజశేఖర్‌లో ఎవరికి ఇంటిలో ఉండే అర్హతలేదో చెప్పాలని హోస్ట్ నాగార్జున కోరడం వివాదాన్ని రేపింది. ఇంటి సభ్యులందరూ అమ్మా రాజశేఖర్‌కు అర్హత లేదని చెప్పి ఓట్లు వేయడం, బిగ్‌బాస్ అతడిని రక్షించడంతో కంటెస్టెంట్లు షాక్ తిన్నారు. ఆ తర్వాత మోనాల్, హారిక మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే..

మోనాల్, హారిక మధ్య సంభాషణ ఇలా
అమ్మా రాజశేఖర్‌తో నీవు మాట్లాడావా? అంటూ మోనాల్‌ను హారిక అడిగింది. అందుకు సమాధానంగా అవును.. క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాను. కానీ అతడు వినే పరిస్థితిలో లేడు. కోపంగా ఉన్నాడు. నాతో జీవితంలో మాట్లాడనని చెప్పాడు అని మోనాల్ వెల్లడించింది. మోనాల్ చెప్పిన మాటలపై హారిక స్పందిస్తూ.. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే అతడితో మాట్లాడలేదు అంటూ జవాబిచ్చింది.

మాస్టర్‌తో నాకు ఎలాంటి గొడవలు లేవు
అమ్మా రాజశేఖర్‌ను నేను ఎప్పుడూ నామినేట్ చేయలేదు. నాకు ఆయనకు మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. చాక్లెట్ విషయంలో జరిగిన సంఘటనను నేను పెద్ద ఇష్యూగా చేసే అవకాశం ఉంది. కానీ నేను చేయలేదు. అది గేమ్‌లో ఒక భాగమని భావించాను కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతీసారి ఆయనను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇద్దరి మధ్య రిలేషన్‌లో ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలి అంటూ హారిక చెప్పింది.

అమ్మా తన ప్రవర్తన మార్చుకోవాలి..
ఇంటిలోని పరిస్థితులను, ఇంటి సభ్యులను అర్ధం చేసుకొని అమ్మా రాజశేఖర్ తన ప్రవర్తనను మార్చుకోవాలి. కానీ అది చేయడం లేదు. ప్రవర్తనను మార్చుకోమని మనం చెప్పలేం అంటూ హారిక వెల్లడించింది. అందుకు సమాధానంగా ఇంటిలో మనం పది మంది ఉన్నాం అని మోనాల్ అంటే.. కాదు పదకొండు మంది. నోయల్ ఇంకా ఇంటిలోనే ఉన్నాడు. నా మనసులోనే ఉన్నాడు అని హారిక డైలాగ్ కొట్టింది. ఈ రోజు నా నోటి నుంచి ఏవేవో డైలాగ్స్ వస్తున్నాయి అంటూ కామెంట్ చేసింది.

కౌగిలించుకొని.. మోనాల్‌కు ఓదార్పు
హరిక, మోనాల్ మధ్య టాపిక్ నామినేషన్ ప్రక్రియ, కెప్టెన్సీ టాస్క్‌పైకి వెళ్లింది. కెప్టెన్సీ టాస్క్‌లో నా బొమ్మతో ఉన్న యాపిల్‌ను కోసినా బాధపడలేదు అంటూ మోనాల్‌ను హారిక గట్టిగా వాటేసుకొన్నది. వీపుపై రాస్తూ ఇద్దరు ఊరడించుకొన్నారు. బెడ్‌పై కూర్చొని కౌగిలించుకొని మాట్లాడు కొంటూ.. గేమ్‌లో నుంచి బయటపెట్టినా నేను బాధపడలేదు. కానీ చెప్పిన కారణాలు మాత్రం నన్ను బాధపెట్టాయి. అందరి మాదిరిగా నన్ను టార్గెట్ చేయడంతో హర్ట్ అయ్యాను అంటూ హారిక తన మనసులోని మాటలను బయటపెట్టింది.

నీవు బాధపడి ఉంటావంటే..
దేత్తడి హారిక మాటలపై మోనాల్ స్పందిస్తూ.. నువ్వు అలా బాధపడుతావని తెలిస్తే.. నేను అలా చేయకుండా ఉండేదాన్ని. ఇక ముందు నామినేషన్లలో మనకు ఇలాంటి గొడవలు వద్దు అంటూ చెప్పింది. అయితే నువ్వు నామినేట్ చేసినందుకో.. గేమ్‌లో నుంచి బయటకు తప్పించడం వల్లనే నేను బాధపడలేదు అంటూ మోనాల్‌ను హారిక దేత్తడి ఊరడించింది.
Recommended Video

9వ వారంలో నామినేట్ అయింది వీరే...
ఇదిలా ఉండగా, 9వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత వారంలో నామినేట్ అయిన వారిలో అవినాష్, అభిజిత్, మోనాల్, హారిక, అమ్మా రాజశేఖర్ ఉన్నారు. ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కెప్టెన్సీ టాస్క్ కోసం అమ్మా రాజశేఖర్ నామినేట్ అయి రేసులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











