అభిజిత్‌తో రిలేషన్‌షిప్ అలాంటిదే.. అలాగే కొనసాగాలి... హారిక దేత్తడి తల్లి క్లారిటీ

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌లో బలంగా కనిపిస్తున్న కంటెస్టెంట్లలో హారిక ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అభిజిత్‌తో రిలేషన్ ఓ షోకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిందని చెప్పవచ్చు. టాప్‌ 5లోకి వెళ్తుందని భావిస్తున్న హారిక గురించి ఆమె తల్లి జ్యోతి చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. బిగ్‌బాస్‌కు ముందు, ఆ తర్వాత ఉన్న విషయాల గురించి జ్యోతి చెబుతూ...

బాల్యం నుంచి హారిక యాక్టివ్

బాల్యం నుంచి హారిక యాక్టివ్

హారిక చిన్నతనం నుంచే చాలా యాక్టివ్. అందరూ 9 నెలల వయసులో నడక నేరుస్తారు. కానీ హారిక 7 నెలల వయసులోనే నడక నేర్చింది. తొమ్మిది నెలల వయసులో పరుగులు పెట్టేంది. స్కూల్‌లో కూడా హారిక చాలా యాక్టివ్. 9 ఏళ్ల వయసులోనే రేడియో జాకీగా అవకాశం వచ్చింది అని హారిక తల్లి జ్యోతి చెప్పారు.

చిన్నతనంలో తండ్రి దూరం కావడంతో

చిన్నతనంలో తండ్రి దూరం కావడంతో

ఇక చిన్నతనంలో తండ్రికి దూరం కావడం వల్ల అనేక సమస్యలను చూసింది. అలాంటి పరిస్థితులను దాటి రావడం వల్లే ఆమె ఓ రకంగా మానసికంగా స్ట్రాంగ్‌గా మారారు. తండ్రి లేని లోటును హారికకు తన అన్నయ్య తీరుస్తాడు. తాను జుట్టు కత్తిరించుకొన్న సమయంలో తను చాలా బాధపడ్డారు అని హారిక తల్లి వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్ నుంచి ఫోన్

లాక్‌డౌన్‌లో బిగ్‌బాస్ నుంచి ఫోన్

లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లు ఫోన్‌లో ఇంటర్వ్యూలు చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం చెప్పారు. అయితే నాకు కూడా బిగ్‌బాస్ ఇష్టం ఉండటంతో తనను వెళ్లమని ప్రోత్సహించాను. 14 ఏళ్ల సంవత్సరాలుగా నేను హిందీ బిగ్‌బాస్ చూస్తుంటాను. బిగ్‌బాస్ తనకు మంచి ఫ్లాట్‌ఫాం అవుతుందని నేను భావిస్తున్నాను అని హారిక తల్లి జ్యోతి పేర్కొన్నారు.

అభిజిత్‌తో మంచి ఫ్రెండ్‌షిప్

అభిజిత్‌తో మంచి ఫ్రెండ్‌షిప్

అభిజిత్‌తో హారిక రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ... బిగ్‌బాస్‌ తెలుగు 4 షోకు ముందు వారిద్దరి మధ్య పరిచయం లేదు. షోలోకి వెళ్లిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే. అది అలానే కొనసాగాలని కోరుకొంటున్నాను. వారిద్దరి మధ్య హెల్తీ ఫ్రెండ్ షిప్ ఉంది అని అన్నారు.

Recommended Video

Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
టాప్ 5లో హారిక ఉంటుంది

టాప్ 5లో హారిక ఉంటుంది

బిగ్‌బాస్ తెలుగు 4 షోలో టాప్ 5 లిస్టులో ఎవరు ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతీ వారానికి చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి చెప్పలేం. కానీ హారిక మాత్రం టాప్ 5లో ఉంటారని బలంగా నమ్ముతున్నాం. ఆమె ఆడే తీరుతోనే ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అది మాకు సంతోషం అని జ్యోతి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X