బలహీనమైన సమయంలో అతడితో.. రిలేషన్‌షిప్ సీక్రెట్ బయటపెట్టిన హారిక దేత్తడి

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 67వ రోజున ఇంటి సభ్యులకు ఓ టాస్ ఇవ్వడం జరిగింది. తమ జీవితంలో ఎవరికి చెప్పని ఓ విషయాన్ని బిగ్‌బాస్ వేదికగా పంచుకోవాలి. ఇంటి సభ్యులు అలా చేస్తే వారికి తమ ఆప్తుల నుంచి సందేశాన్ని అందుకొంటారు. అయితే ఆ సందేశాన్ని ఇంటి సభ్యులు చేరవేయాలా వద్దా అనే అధికారాన్ని సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా హారిక కన్ఫెషన్ రూమ్‌కి వచ్చి...

అమ్మా నీ వద్ద ఏదీ దాచలేదు..

అమ్మా నీ వద్ద ఏదీ దాచలేదు..

నేను చెప్పబోయేది ఫ్యామిలికి సంబంధించింది. జనరల్‌గా నా జీవితం అంతా ఓపెన్ బుక్. మా అమ్మ దగ్గర దాచింది ఏది లేదు. కానీ నా అఫైర్ విషయాన్ని మాత్రం చెప్పలేదు. గత ఆరు నెలలుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కానీ బిగ్‌బాస్ వేదిక వద్ద నుంచి నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను చెప్పాలనుకొంటున్నాను అని హారిక అన్నారు.

భయంతో చెప్పలేదు.. ధైర్యంతో

భయంతో చెప్పలేదు.. ధైర్యంతో

నేనేదో చెబుతున్నానని మమ్మి టెన్షన్ పడకు. నీకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ నాకు భయం వేసి చెప్పలేకపోయాను. చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్పిన తిట్టడానికి, కొట్టడానికి నా ఎదురుగా నీవు లేవు. ఏదైనా అయితే బయటకు వచ్చిన తర్వాత జరుగుతుంది అని భయం భయంగా తన అఫైర్ విషయాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించారు.

రెండేళ్ల క్రితం వరకు రిలేషన్‌షిప్

రెండేళ్ల క్రితం వరకు రిలేషన్‌షిప్

సాధారణంగా అన్నయ్యకు, ఆయన ఫ్రెండ్స్‌కు నా గురించి మంచిగా చెబుతావు. ప్రేమ, అఫైర్లు అనే విషయాన్ని పట్టించుకొనని నా గురించి ఎగ్జాంపుల్‌గా చెబుతావు. కానీ రెండేళ్ల క్రితం వరకు నేను ఓ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు లేను. మొత్తం నాలుగున్నర ఏళ్లపాటు రిలేషన్ షిప్‌లో ఉన్నాం అని హారిక తెలిపారు.

అతడు నన్ను ఎంతో కేరింగ్‌గా

అతడు నన్ను ఎంతో కేరింగ్‌గా

నువ్వు, డాడీ విడిపోయిన సందర్భంలో ఇంట్లో పరిస్థితులు గందరగోళంగా మారాయనే విషయం తెలిసిందే. అలాంటి సమయంలో నేను కూడా ఎమోషనల్‌గా మారాను. ఆ సమయంలో నన్ను ఓ వ్యక్తి కేరింగ్‌గా చూసుకొన్నాడు. దాంతో మా మధ్య ఆటోమెటిక్‌గా అఫైర్, రిలేషన్‌షిప్ మొదలైంది. నా మీద ఉన్న నీ నమ్మకం ఎక్కడ పోతుందో అనే విషయంతోనే నేను నీకు చెప్పలేదు అని హారిక ఎమోషనల్ అయ్యారు.

అఫైర్ బ్రేకప్ జరిగింది..

అఫైర్ బ్రేకప్ జరిగింది..

ఇప్పుడు నాకు ఎలాంటి అఫైర్ లేదు. నాలుగేళ్ల క్రితం ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. అలాంటి రిలేషన్‌షిప్ నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు సూపర్ గుడ్. ఇప్పుడు నాకు కెరీర్ తప్ప మరో ఫోకస్ లేదు. ఈ విషయం తప్ప మరోటి నీ వద్ద ఏదీ దాచలేదు. ఇప్పుడు నా వద్ద దాచిన సీక్రెట్స్ ఏమీ లేవు. భవిష్యత్‌లో ఏమైనా వస్తే తప్ప. అమ్మ నీకు మొత్తం చెప్పాను. ఇక క్షమించాలి అంటూ హారిక తన సీక్రెట్ చెప్పేసింది.

హారిక సీక్రెట్‌పై అఖిల్ సంతృప్తి

హారిక సీక్రెట్‌పై అఖిల్ సంతృప్తి

ఇక హారిక చెప్పిన సీక్రెట్‌కు సంతృప్తి పడిన అఖిల్ సార్తక్.. ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను ఆమెకు పంపించాడు. చిన్న విషయమైనా మంచి సీక్రెట్.. పెద్ద విషయం అంటూ అఖిల్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత తన లెటర్‌ను అందుకొన్న హారిక దానిని చదువుతూ భావోద్వేగానికి గురయింది. అలా తన సీక్రెట్ ఇంట్లో వాళ్లకే కాకుండా ప్రేక్షకులకు కూడా చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X