కత్తులు కూడా వాడాను.. హద్దు మీరడమే లోపం.. బిగ్‌బాస్ విజేతను నేనే.. హారిక ఎమోషనల్‌గా
బిగ్‌బాస్ ఇంటిలో 99వ రోజు జరిగిన పలు టాస్కుల్లో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఈ ట్రోఫిని గెలిచేందుకు ఎందుకు తమకు అర్హత ఉందనే విషయంపై వివరంగా కొన్ని పాయింట్స్ వెల్లడించారు. టైటిల్ రేసులో తనకే ఎందుకు అర్హత ఉంది? ఇతరులకు అర్హత లేదనే విషయంపై చర్చ జరిగిన సమయంలో దేత్తడి హారిక స్పందిస్తూ..

కొన్నిసార్లు కత్తులు.. మరికొన్ని సార్లు పూలు
బిగ్‌బాస్ ఇంటిలో రాణించడం ఒక ఛాలెంజ్. టాస్కుల సందర్భంగా బిగ్‌బాస్ కత్తులు, పూలు ఇచ్చారు. కొన్ని సార్లు కత్తులు ప్రయోగించాను.. కొన్ని సార్లు పూలు కూడా ఇంటి సభ్యులకు ఇవ్వాల్సి వచ్చింది. టాస్కుల సందర్భంగా కత్తులు వాడాల్సి వచ్చినా నేను భయపడలేదు. నేను వాడిన కత్తి ఎవరికి ఇబ్బంది కలుగలేదు అనేది నా అభిప్రాయం అంటూ దేత్తడి హారిక తెలిపింది

అందరితో నాకు మంచి రిలేషన్స్
బిగ్‌బాస్ ఇంటిలో సాగిన 14 వారాల ప్రయాణంలో ప్రతీ ఒక్కరితో నాకు మంచి రిలేషన్ ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ స్టేజ్‌పైకి వెళ్లిన ప్రీ ఒక్కరు కూడా నన్ను ఏ రకమైన కామెంట్ చేయలేదు. దానిని బట్టి నా యాటిట్యూడ్ ఏంటో స్పష్టమైంది. నాకు ఎవరు కూడా అది చేయాలి? ఇది చేయాలని కూడా సలహాలు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి నాకు రాలేదు అంటూ దేత్తడి హారిక చెప్పింది..

విజేత ఎవరనేది ప్రేక్షకుల చేతుల్లోనే..
బిగ్‌బాస్ షో వరకు వస్తే.. నేను ప్రతీసారి 100 శాతం ఎఫర్ట్ పెట్టాను. నేను ఈ టైటిల్ అర్హురాలినా అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ప్రేక్షకులు ఆలోచించే తీరు బట్టే విజేత ఎవరనేది నిర్ణయం జరుగుతుంది. నా వరకు నేను ఈ హౌస్‌లో సూపర్ స్మార్ట్‌గా, కూల్, ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నాను అని హారిక తెలిపింది.
Recommended Video

అరియానాకు అర్హత లేదు
ఇక ఇంటిలో టైటిల్ అనర్హులు అనే విషయానికి వస్తే.. అరియానా అనర్హురాలు అని భావిస్తున్నాను. అయితే కేవలం 5 శాతం మేరకు అలాంటి ఫీల్ ఉంది. టాస్కుల విషయంలో హద్దు మీరి ఆడుతుంది. అది ఒక్కటే నాకు నచ్చనిది. అందుచేత ఈ టైటిల్‌కు అరియానా అనర్హురాలు అని నేను భావిస్తున్నాను అని హారిక దేత్తడి పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











