‘బిగ్‌బాస్‌ చూడని యాంగిల్ బయటికి తీస్తా... ఈసారి కప్‌తోనే ఇంటికి’

బిగ్‌బాస్ తెలుగు 9లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్‌‌ని ఎవ్వరూ మరిచిపోరు. ముక్కుసూటితనంతో ఏకంగా కింగ్ అక్కినేని నాగార్జునతోనే గొడవకు దిగాడు. కంటెస్టెంట్స్ మీద నోరేసుకుని పడిపోతూ ఎదుటివాడిని మాట్లాడనిచ్చే వాడు కాదు. మనోడి స్పీడ్ చూసి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొద్దివారాలకే బిగ్‌బాస్‌లో తన ప్రస్థానాన్ని ముగించాడు. బిగ్‌బాస్‌లో తన స్థాయికి తగినట్లుగా ఆడలేదని పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేశారు హరిత హరీశ్. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత అదే తరహాలో మరో రియాలిటీ షోతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

బిగ్‌బాస్ మాదిరిగా సింగిల్స్ పాల్గొనే షో కాదు.. జంటలు పాల్గొనే షో. అది కూడా పెళ్లయిన వారికి మాత్రమే ఎంట్రీ. 10 వారాల పాటు 10 జంటలని ఒక మ్యాన్షన్‌లో ఉంచుతారు. చివరి వరకు ఏ జంట అయితే ఉంటుందో వారే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో విజేతగా నిలుస్తారు. స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయలు జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ప్రియాంక జైన్ - శివకుమార్, నూకరాజు - ఆసియా, వాసంతి- పవన్ కళ్యాణ్, జాను - భాను, బ్రిట్టో- సంధ్య, సోనియా - సిద్ధూ, సాండ్రా - మహేశ్, నీతూ- నటరాజ్, హరిత- హరీష్‌, అంజలి - పవన్‌లు ఎంట్రీ ఇచ్చారు. మార్చి 15న ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనే జంటలు ఒక్కొక్కరుగా ఇంటర్వ్వూలు ఇస్తున్నారు. తాజాగా హరిత హరీష్ తన భార్యతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Haritha Harish Couples Reality Show Entry After Bigg Boss Telugu 9 Interesting Comments Go Viral

లవ్ మ్యాన్షన్‌లోకి వెళ్లబోతున్నందుకు నాకు ఎలాంటి భయం లేదు. ఈసారి నేనంటే ఏంటో చూడబోతున్నారు. బిగ్‌బాస్‌లో నాలో ఒక షేడే చూశారు.. ఇప్పుడు నాలో ఉన్న లవర్‌ బాయ్‌ని చూస్తారు. అది హరిత గారికి మాత్రమే తెలుసు.. ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారు. ఈ షోలో జంటల మధ్య ఏదైనా గొడవ వస్తే సామ దాన భేద దండోపాయాలను అన్నింటిని వాడేస్తాడు. తను పుట్టి పెరిగింది అంతా నార్త్ ఇండియాలో.. టెన్త్ కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత ఒక బాయ్ నా కోసం పుట్టి వెయిట్ చేస్తున్నాడని వచ్చేసింది. నును పది సెకన్లు ఫాస్ట్ అయితే.. మేడం పది సెకన్లు స్లో. ఇద్దరికీ అలా మ్యాచ్ అయిపోయింది. 5 ఇయర్స్ లవ్, 15 ఇయర్స్ మ్యారేజ్ మొత్తం కలిపి మా ఇద్దరిది 20 ఇయర్స్ లవ్ అని హరిత హరీశ్ అన్నారు.

నా గ్లామర్ అంతా హరిత లాగేసింది. అలాగే వాయిస్‌లో మెసేజ్ ఉండాలి, నోయిస్ ఉండకూడదు. మనలో ఉన్న వెరియేషన్స్ కూడా జనం చూడాలి. లవ్ అనే పెద్ద సర్కిల్‌లో కోపం అనేది చిన్న ఎమోషన్. చిన్న జీవితంలో ఏదైనా జెన్యూన్‌గా ఉండాలి. రైటో రాంగో ముందు మాట్లాడతా.. తర్వాత దాని వల్లే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సారీ చెప్పడానికి వెనుకాడను అని హరీశ్ అన్నారు. నాకు కొన్ని వస్తువులు విసిరే అలవాటుంది.. దానిని ఆపాలని ట్రై చేశానని హరిత చెప్పారు. తినే తిండి విషయం నుంచి ప్రతి విషయంలోనూ తన సలహా అడుగుతా. వంట ఇద్దరం కలిసి చేసుకుంటామని హరీష్ పేర్కొన్నారు.

కోపమొస్తే విడాకులు ఎక్కడున్నాయో చెప్పండి అని నేనే రంకెలు వేస్తా. మా ఫోన్లకు పాస్‌వర్డ్స్ ఉండవు, ఆయన ఫోన్‌లో నా ఫింగర్ ప్రింట్, ఈయన ఫోన్‌లో నా ఫింగర్ ప్రింట్ ఉంటుంది. పాస్‌వర్డ్స్ ఇద్దరికీ తెలుసు. ఆయన జీవితంలో నేను 16వ అమ్మాయిని అని హరిత అన్నారు. 15 మందిని చూశాం.. వాళ్లలో ఈవిడ నచ్చింది అనుకోండి. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేదు. నాకు సోల్‌మేట్ కావాలి.. స్టిల్‌మేట్ కావాలి. రంభ ఊర్వశి మేనక వచ్చినా కూడా నేను చలించను. ముక్కుసూటిగానే ఉండాలి.. వంకరగా ఉంటే బాగుండదని హరిత హరీశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X