ఛాన్స్ అడిగితే రూమ్‌కు రమ్మన్నారు.. జబర్ధస్త్‌లో అలాంటి అవమానం: ఆ లీడర్లపై హరిత సంచలన వ్యాఖ్యలు

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే మరే షోకూ అందని రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది జబర్ధస్త్. దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేక్షకుల మనసు దోచుకుంటోన్న ఈ షో.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. విమర్శలు వెల్లువెత్తుతున్నా... పోటీగా ఎన్నో షోలు పుట్టుకొస్తున్నా... దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ షో. అందులో లేడీ గెటప్‌లతో ఆకట్టుకుంటోన్న హరిత కూడా ఒకరు. ప్రతి స్కిట్‌లోనూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోన్న ఆమె.. తాజా ఇంటర్వ్యూలో కొందరు టీమ్ లీడర్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

కొన్ని వందల మంది.. అందులో హరిత ఒకరు

కొన్ని వందల మంది.. అందులో హరిత ఒకరు

జబర్ధస్త్ షో వల్ల ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా.. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది జబర్ధస్త్ హరి అలియాస్ హరిత. లేడీ గెటప్‌లతో ఆకట్టుకుంటూ ఎంతగానో ఫేమస్ అయిన ఆమె.. కట్టు బొట్టులో అచ్చం అమ్మాయిలాగే ఉంటూ అదరగొడుతుంటుంది.

కన్‌ఫ్యూజన్ స్కిట్లలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్

కన్‌ఫ్యూజన్ స్కిట్లలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్

జబర్ధస్త్‌లోకి వచ్చిన కొత్త కిర్రాక్ ఆర్పీ సహా పలువురి టీమ్‌లలో పని చేసింది హరిత. ఆ తర్వాత చాలా స్కిట్లలో అదిరిపోయే పెర్పార్మెన్స్ ఇచ్చింది. కొన్నేళ్లుగా కన్‌ఫ్యూజన్ కామెడీ స్కిట్ల స్పెషలిస్టుగా పేరొందిన వెంకీ మంకీస్ టీమ్‌లో సభ్యురాలిగా చేస్తోంది హరిత. ఇందులో ఆమె కోసం రాసే కొన్ని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. వాటిని పలికించడంలో ఆమె సక్సెస్ అవుతోంది.

ఎక్కువగా అలాంటివే.. విమర్శలు లెక్కచేయక

ఎక్కువగా అలాంటివే.. విమర్శలు లెక్కచేయక

ఈ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే హరితకు ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేశారు అందులోని టీమ్ లీడర్లు. మరీ ముఖ్యంగా ఈ లేడీ గెటప్పుల అబ్బాయికి ఎక్కువగా డబుల్ మీనింగ్ ఉన్న డైలాగులనే రాస్తుంటారు. వాటిని అంతే చక్కగా చెప్పి నవ్వులు పూయిస్తోంది. కాకపోతే జబర్ధస్త్‌లో ఆమె పోషించే క్యారెక్టర్ విషయంలో చాలా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్వ్యూతో కలకలం రేపుతోన్న జబర్ధస్త్ లేడీ

ఇంటర్వ్యూతో కలకలం రేపుతోన్న జబర్ధస్త్ లేడీ

జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన గుర్తింపును దక్కించుకుంది హరిత. అందుకే ఆమె ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమెడియన్‌తో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో జబర్ధస్త్ షో, అందులోని టీమ్ లీడర్లు, తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. దీంతో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

పైకలా కనిపించినా.. అసలు నిజం వేరు అంటూ

పైకలా కనిపించినా.. అసలు నిజం వేరు అంటూ

జబర్ధస్త్ హరిత చూడడానికి ధనవంతురాలిగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమె ముందు ప్రస్తావించింది. దీనికి 'నేను పైకి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు కనిపిస్తాను. ఇదే విషయం చాలా మంది నాతో చెప్పారు. కానీ, అందురూ అనుకున్నది రాంగ్. మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఒకరోజు తింటే రెండు రోజులు పస్తులున్న రోజులూ ఉన్నాయి' అని వెల్లడించింది.

ఛాన్స్ అడిగితే రూమ్‌కు రమ్మన్నారు.. కాల్ చేసి

ఛాన్స్ అడిగితే రూమ్‌కు రమ్మన్నారు.. కాల్ చేసి

ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది హరిత. 'పేర్లు చెప్పను కానీ.. ఓ ఇద్దరు టీమ్ లీడర్లు చాన్సులు ఇస్తామని రూమ్‌కు రమ్మన్నారు. నేను మా ఊరి నుంచి బస్‌లో వస్తుండగానే.. అది వేరే వాళ్లకు ఇచ్చాం అని చెప్పారు. దీంతో దిల్‌సుక్‌నగర్ బస్టాండులోనే ఆగిపోయి ఏడుస్తూ ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి' అని చెప్పింది.

జబర్ధస్త్‌లో అలాంటి అవమానం.. తర్వాత కూల్

జబర్ధస్త్‌లో అలాంటి అవమానం.. తర్వాత కూల్

జబర్ధస్త్ షోలో తనకు అవమానం జరిగిందని చెప్పిన హరిత.. దానిని వివరిస్తూ 'నేను షోలోకి వచ్చిన కొత్తలో నా వాయిస్ చూసి కొందరు టీమ్ లీడర్లు హేళన చేశారు. దీంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అలాంటి టైమ్‌లో ఓ స్కిట్ నన్ను నిలబెట్టింది. అప్పుడు రోజా గారు, నాగబాబు సార్ నా వాయిస్‌ను మెచ్చుకున్నారు. దీంతో నేను మనిషిని అయ్యాను' అని చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X