Bigg Boss Telugu 6: బిగ్ బాస్‌లోకి యూట్యూబర్ హర్ష సాయి.. తొలిసారి పెదవి విప్పడంతో క్లారిటీ

ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్పందనను సొంతం చేసుకుంటూ అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోన్న ఏకైక షో బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే కార్యక్రమమే అయినా దీనికి ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో దానిని కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులోకి వెళ్లే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరు తెగ హైలైట్ అవుతోంది. దీంతో తాజాగా అతడు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఐదు సీజన్లు పూర్తి.. విజేతలు వీళ్లే

ఐదు సీజన్లు పూర్తి.. విజేతలు వీళ్లే

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా బిగ్ బాస్ తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకూ ఇది ఐదు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి సీజన్‌లో శివ బాలాజీ, రెండో దానిలో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్, నాలుగో సీజన్‌లో అభిజీత్, ఐదో సీజన్‌లో వీజే సన్నీలు విజేతలుగా నిలిచారు.

ఓటీటీ సీజన్.. ఫస్ట్ లేడీ విన్నర్‌గా

ఓటీటీ సీజన్.. ఫస్ట్ లేడీ విన్నర్‌గా

బిగ్ బాస్ సూపర్ హిట్ అవడంతో నిర్వహకులు ఇటీవలే ఓటీటీ వెర్షన్ ‘నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను పరిచయం చేశారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికరమైన సన్నివేశాలను చూపించారు. ఫలితంగా దీనికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఇక, ఈ సీజన్‌లో బిందు మాధవి విజేతగా నిలిచి మొట్టమొదటి లేడీ కంటెస్టెంట్‌గా రికార్డు సృష్టించింది.

ఆరో సీజన్‌కు రంగం సిద్ధంగానే

ఆరో సీజన్‌కు రంగం సిద్ధంగానే

బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. అదిరిపోయే స్పందనను అందుకుంటోన్న బిగ్ బాస్ ఆరో సీజన్ త్వరలోనే రాబోతుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో షో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ షో గురించి రకరకాల ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇది హైలైట్ అవుతోంది.

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

అప్పటి నుంచే.. ఆ కంటెస్టెంట్

బుల్లితెర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు నిర్వహకులు అప్పుడే సెట్ వర్క్‌ను కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు. నాన్ స్టాప్ సీజన్‌లో వాడిన ఇంట్లో మార్పులు చేసి కొత్తగా నిర్మిస్తున్నారట. ఇక, ఇందులో ఓ కామన్ మ్యాన్‌కు కూడా అవకాశం కల్పిస్తోన్నారు.

కంటెస్టెంట్ ఎంపిక ఫస్ట్ స్టేజ్‌లో

కంటెస్టెంట్ ఎంపిక ఫస్ట్ స్టేజ్‌లో


బిగ్ బాస్ ఆరో సీజన్ మీదనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుండడంతో.. ఇందులో పలానా సెలెబ్రిటీ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం అయిందట. అంతేకాదు, ఫస్ట్ స్టేజ్ కూడా పూర్తైందట.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
ఆరో సీజన్‌లో హర్ష సాయి రాక

ఆరో సీజన్‌లో హర్ష సాయి రాక

బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నిర్వహకులు సంప్రదించినట్లు.. ఇందులోకి ఎంట్రీ ఇచ్చేందుకు అతడు ఓకే చెప్పినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్త తెగ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం హర్ష సాయి చాలా ఫేమస్ అయిన యూట్యూబర్ కావడమే. అతడి వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తుంటుందన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఎంట్రీపై హర్ష క్లారిటీ

బిగ్ బాస్ ఎంట్రీపై హర్ష క్లారిటీ


బిగ్ బాస్ గురించి వస్తున్న వార్తలపై హర్ష సాయి స్పందించాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ‘నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు ఒక ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండడం ఇష్టం ఉండదు. నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే నా వీడియోలు కూడా నాకిష్టమైన సమయంలోనే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను' అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X