మానవత్వం లేదు, అంతా డబ్బ కోసమే: బాధ వెల్లగక్కిన యాంకర్ శ్రీముఖి!
యాంకర్ శ్రీముఖి... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎనర్జిటిక్ యాటిట్యూడ్‌తో ఎంతో చలాకీగా యాంకరింగ్ చేసే శ్రీముఖి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా లక్షల్లో ఉంది.
ఎప్పుడూ హ్యాపీగా కనిపించే శ్రీముఖి.... తాజాగా సోషల్ మీడియాలో తన బాధను వెల్లగక్కుతూ ఓ పోస్టు పెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు బట్టి శ్రీముఖి కొందరి వల్ల చాలా ఫెయిన్ ఫీలైనట్లు స్పష్టం అవుతోంది. అయితే దాని వెనక ఉన్న కారణం ఏమిటనేది శ్రీముఖి వెల్లడించలేదు. ఇంతకీ ఆమె ఏం పోస్టు పెట్టారో ఓ లుక్కేద్దాం...

మనుషులు మానవత్వం కోల్పోయారా?
మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందనే మాట సాధారణంగా చాలా మంది నా ముందు అనడం విన్నాను. నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని సంఘటనలు ఎదుర్కొన్న తర్వాత అది నిజమే అని ఫీలవ్వక తప్పలేదు అని శ్రీముఖి తెలిపారు.

డబ్బు కోసం బ్రతుకున్నాం...
సీరియస్లీ... ఇప్పుడు అందరూ కేవలం డబ్బు కోసమే జీవిస్తున్నారు. రాను రాను మనుషుల్లో హ్యుమానిటీ పూర్తిగా నశించి పోతుందేమో అనే భయం కలుగుతోంది అంటూ శ్రీముఖి తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

అలా జరిగితే సంతోషిస్తా
జనాల్లో మానవత్వం పూర్తిగా నిశించకముందే ఈ ప్రపంచం అంతమైపోతే చాలా సంతోషిస్తాను... దేవుడి దయవల్ల అలా జరుగాలని కోరుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చారు. శ్రీముఖి పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నువ్వు డబ్బుకోసం చేయడం లేదా?
శ్రీముఖి పోస్టుపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ... ‘నువ్వు చేస్తున్న పటాస్ కార్యక్రమం వల్గర్‌గా ఉందని చాలా మంది ఫీలవుతున్నారు. అయినా నువ్వు ఆ షో చేస్తూనే ఉన్నావు... నువ్వు ఆ షో చేసేది డబ్బు కోసం కాదా? ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా ఎవరూ సర్వైవ్ కాలేరు' అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











