ఆ రోజు నుంచే షూటింగ్.. బిగ్‌బాస్‌తో మీ ముందుకు వస్తున్నా.. నాగ్ వీడియో వైరల్

కింగ్ నాగార్జున బర్త్ డే నేడు (ఆగస్ట్ 29). ఇక నాగ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సమంత విడుదల చేసిన నాగార్జున బర్త్ డే కామన్ డీపీ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఈ మేరకు నేడు నాగ్‌కు టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగ్ తనకు వస్తోన్న విషెస్, కురిపిస్తోన్న ప్రేమకు ప్రతిగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చాడు.

లాంగ్ గ్యాప్..

లాంగ్ గ్యాప్..

దాదాపు ఐదారు నెలలు స్టార్స్ అంతా ఇంటి పట్టునే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొందరు బయటకు వచ్చి షూటింగ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్ నుంచి నాగార్జున మాత్రం అందరి కంటే ముందుగా సెట్స్ పైకి వచ్చాడు. అది కూడా రియాల్టీ షో అయిన బిగ్ బాస్ కోసం.

ఇప్పటికే ప్రోమోలు వైరల్..

ఇప్పటికే ప్రోమోలు వైరల్..

బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి. తాత, నాన్న, మనవడి గెటప్‌లో నాగ్ దుమ్ములేపాడు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలు సైతం బిగ్ బాస్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. గాసిప్, ఆడవాళ్ల ముచ్చట్లు, రొమాన్స్ అంటూ ప్రోమోల్లో బాగానే హైలెట్ చేస్తున్నారు.

కంటెస్టెంట్లు రెడీ..

కంటెస్టెంట్లు రెడీ..

బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో పాల్గొనబోయే వారి లిస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాని ప్రకారం.. నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, ఆరియానా, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ వంటి వారు నాల్గో సీజన్‌లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ముహూర్తం ఫిక్స్..

ముహూర్తం ఫిక్స్..

కరోనా ప్రకంపనలు బిగ్ బాస్ హౌస్‌లోనూ మొదలవ్వడంతో ముందుగా నిర్ణయించిన ప్లానింగ్ దెబ్బతింది. ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్.. సెప్టెంబర్ మొదటి వారానికి షిప్ట్ అయింది. ఇక ఈ షోను సెప్టెంబర్ 6ను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించబోతోన్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

Recommended Video

Celebrities Green India Challenge
షూటింగ్ మొదలు..

షూటింగ్ మొదలు..

ఇక బిగ్ బాస్ షూటింగ్‌ను సోమవారం నుంచి మొదలు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి బిగ్ బాస్, వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొనబోతోన్నట్టు నాగ్ ప్రకటించాడు. బిగ్ బాస్ మూడో సీజన్ ఎంతగానో సపోర్ట్ చేసి సక్సెస్ చేశారు. అలాగే నాల్గో సీజన్‌ను కూడా సక్సెస్ చేయాలి, మీ ప్రేమ కావాలి అంటూ ప్రేక్షకులను కోరాడు నాగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X