సీక్రెట్ ప్లేస్‌లో పవన్ కల్యాణ్ టాటూ చూపిస్తూ.. పవర్ స్టార్‌కు అషురెడ్డి ఎమోషనల్ విషెస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు వ్యక్తిగతంగా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ చెబుతున్నారు. అయితే బిగ్‌బాస్ బ్యూటీ, సినీనటి అషు రెడ్డి మాత్రం తన అభిమాన నటుడికి వెరైటీగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్‌తో స్టార్‌డమ్
బిగ్‌బాస్ తెలుగు షో ద్వారా స్టార్‌డమ్ అందుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. పోలికలు, ఫిగర్ పరంగా అచ్చుగుద్దినట్లుగా హీరోయిన్ సమంతలా ఉండటంతో ఆమెను అందరూ జూనియర్ సమంత అని పిలుచుకుంటూ ఉంటారు. తొలుత అమెరికాలో స్థిరపడిన అషురెడ్డి డబ్‌స్మాష్, రీల్స్, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాను ఊపేసింది. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అషురెడ్డి ఛాన్స్ కొట్టేశారు. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగాలో నటించింది అషురెడ్డి. దాంతో తాడోపేడో ఇండస్ట్రీలోనే తేల్చుకోవాలని అనుకున్న అషురెడ్డి.. ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు వచ్చేసింది. తొలుత యాంకర్‌గా తన ప్రస్థానం ప్రారంభించి.. నెమ్మదిగా సినిమాలలో అవకాశం దక్కించుకుంది.

ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఫేమస్
అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూ, ఆయనతో స్టెప్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ కింద కూర్చొని అషురెడ్డి పాదాలను తాకుతూ, ముద్దు పెట్టుకున్న వీడియో ఇండస్ట్రీలో దుమారం రేపింది. దీంతో ఆర్జీవీ, అషురెడ్డిలపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అందంతో పాటు నలుగురిని ఆదుకునే మంచి మనసు కూడా ఈ ముద్దుగుమ్మకు ఉంది. కొన్నేళ్ల నుంచి అషురెడ్డి కొంతమంది పిల్లలను చదివిస్తున్నారు.
పవన్‌కు నాలుగో భార్యగా ఉంటా
ఇక చిన్నప్పటి నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోతారు అషురెడ్డి. పవన్ ఒప్పుకుంటే ఆయనకు నాలుగో భార్యగా కూడా ఉంటానని అప్పట్లో బోల్డ్ కామెంట్స్ చేసింది. హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అభిమాన నటుడిని కలిసే అవకాశం దక్కించుకుని పొంగిపోయింది. 10 నిమిషాలు మాట్లాడటమే గొప్ప అనుకుంటే మమ్మల్ని 2 గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారని అషురెడ్డి ఓ సందర్భంలో గుర్తుచేసుకుంది. పవన్ కళ్యాణ్ వంటి సూపర్‌స్టార్... నా పేరును పచ్చబొట్టు వేయించుకుంది నువ్వేనా అని తనను గుర్తుపట్టి మాట్లాడటం జీవితంలో మరిచిపోలేనని తెలిపింది.
నా గాడ్‌కు బర్త్ డే విషెస్
తాజాగా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తన ఫేవరెట్ యాక్టర్‌కు వెరైటీగా విషెస్ తెలియజేసింది అషురెడ్డి. వైట్ కలర్ డ్రెస్‌లో, ఎద భాగం కనిపించేలా ధరించిన ఆమె.. తన ప్రైవేట్ పార్ట్స్‌పై పవన్ కళ్యాణ్ అని వేయించుకున్న టాటూని చూపిస్తూ ఫోటోని షేర్ చేసింది. నువ్వు పుట్టిన గడ్డపై మేం కూడా పుట్టినందుకు గర్వంగా ఉందని, గాడ్ ఆఫ్ పీపుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











