For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Sudigali Sudheer: సుధీర్ పెళ్లిపై క్లారిటీ.. బిగ్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న స్టార్!

  |

  బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, జబర్ధస్త్ షోలోకి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్లను బయట పెట్టిన అతడు.. టాప్ కమెడియన్ అయ్యాడు. అదే సమయంలో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే, అతడి పెళ్లి గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. ఈరోజు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు మీకోసం!

  మ్యాజిక్ షోల నుంచి జబర్ధస్త్‌లోకి

  మ్యాజిక్ షోల నుంచి జబర్ధస్త్‌లోకి

  మ్యాజిక్‌ షోలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించాడు సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే పలు చానెళ్లలో కూడా ట్రిక్స్‌ను చూపించే గేమ్ షోలను చేశాడు. అలా తెలుగు ప్రేక్షకుల గుర్తింపును అందుకున్నాడు. ఆ సమయంలోనే వేణు వండర్స్ టీమ్ ద్వారా జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ టైమ్‌లోనే టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను పట్టేసి దూసుకెళ్తున్నాడు.

  అన్నింట్లోనూ సత్తా.. ఆల్‌రౌండర్

  అన్నింట్లోనూ సత్తా.. ఆల్‌రౌండర్

  సుడిగాలి సుధీర్ కమెడియన్‌గా రాణిస్తున్నప్పటికీ.. అతడిలోని ఎన్నో టాలెంట్లు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు. ఇప్పటికే మ్యాజిక్‌లు చేస్తూ గుర్తింపు పొందిన అతడు.. సింగర్‌గా, డ్యాన్సర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తద్వారా ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక, అమ్మాయిల విషయంలోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్లేబాయ్ అనిపించుకుంటున్నాడు.

  యాంకర్ రష్మీతో సుధీర్ రిలేషన్

  యాంకర్ రష్మీతో సుధీర్ రిలేషన్

  సుడిగాలి సుధీర్ తన టాలెంట్లతో ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు కూడా.

  అక్కడ మాత్రం విఫలం అయ్యాడు

  అక్కడ మాత్రం విఫలం అయ్యాడు

  బుల్లితెరపై తిరుగులేకుండా పోతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేశాడు. అయితే, హీరోగా మాత్రం అతడికి నిరాశనే ఎదురైంది. ఆ మధ్య ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత ‘త్రీమంకీస్' చేశాడు. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

  హీరోగా రీలాంఛ్ అయ్యేందుకు రెడీ

  హీరోగా రీలాంఛ్ అయ్యేందుకు రెడీ

  హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ‘కాలింగ్ సహస్ర' అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాతో అతడు రీలాంచ్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది.

  సుధీర్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందిగా

  సుధీర్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందిగా

  సుడిగాలి సుధీర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అది కూడా యాంకర్ రష్మీ గౌతమ్‌తోనే అతడు ఏడడుగులు నడవబోతున్నాడని అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అతడు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదట. మరో రెండేళ్ల వరకూ బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  బిగ్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న స్టార్

  బిగ్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న స్టార్

  ‘కాలింగ్ సహస్ర'తో రీలాంచ్ అవుతోన్న సినిమా కావడంతో.. దీని కోసం సుధీర్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో అతడు సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని కోసం ట్రైనర్ సహాయంతో జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు, ఈ మూవీలో అతడు రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాడని టాక్. బుల్లితెరపై సక్సెస్ అయినట్లే వెండితెరపైనా దూసుకుపోవాలని కోరుకుంటూ సుడిగాలి సుధీర్‌కు ఫిల్మీ‌బీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Telugu Actor and a Stand-up comedian Sudigali Sudheer Doing Calling Sahasra Movie. In This Movie He will so Six Pack Body.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X