twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ ఛానెల్ ఆస్తులు జప్తు...కోర్టులో విచారణ

    By Srikanya
    |

    చెన్నై : 2జీ స్పెక్ట్రమ్‌ స్కామ్ నీడ...సన్ టీవి కు ఇప్పుడు చుట్టుకుని భయపెడుతోంది. ఇందునిమిత్తమై ఛానెల్ కు సంభందించిన ఆస్తులు జప్తు చేయాలని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ మారన్‌ సోదరులకు చెందిన సన్‌ టీవీ, కల్‌ కమ్యూనికేషన్స్‌ పెట్టుకున్న రిట్‌ పిటిషన్లపై తీర్పును మద్రాసు హైకోర్టు మంగళవారం వాయిదా వేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    జస్టిస్‌ సత్యనారాయణన్‌ సమక్షంలో జరిగిన విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరపున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ జి.రాజగోపాలన్‌ తన వాదన వినిపిస్తూ 2జీ స్రెక్ట్రమ్‌ కేసును తామే పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారణ జరపాలా వద్దా అనే విషయంపై సన్‌ టీవీ, కల్‌ కమ్యూనికేషన్స్‌ వివరణ ఇవ్వాలని కోరారు.

     HC reserves order on Sun TV petition against ED attachment

    ఎయిర్‌సెల్‌ మేక్సిస్‌ కేసు కూడా 2జీ స్పెక్ట్రమ్‌ పరిధిలోకే వస్తుందని గుర్తు చేశారు. మారన్‌ సోదరుల సంస్థ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ రామన్‌ వాదిస్తూ ఈ కేసు ముగిసే వరకు ఆస్తులను పరాధీనం చేయబోమన్నారు. ఆస్తుల జప్తు ఆదేశాలను రద్దు చేయాలని వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్లపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

    English summary
    The Madras High Court on Tuesday reserved its order on the petitions filed by Sun TV and Kal Comm Pvt Ltd, challenging the attachment of two of its properties by the Enforcement Directorate (ED) in connection with the Aircel Maxis case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X