'సెట్‌టాప్‌' బాక్స్‌ల వివాదం... హైకోర్టు ఊరట

By Srikanya

HC stay on set top boxes for one week
హైదరాబాద్: టీవీలకు 'సెట్‌టాప్‌' బాక్స్‌లు లేకపోయినా ప్రసారాలు చేస్తున్న ఎంఎస్‌వో(మల్లీ సిస్టమ్‌ ఆపరేటర్‌)లపై 10 రోజుల వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఎంఎస్‌వోలు వ్యవహరిస్తే పోలీసులకు చర్యలకు తీసుకొనే అవకాశం ఉండడంతో, వారిపై చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్‌, సైబరాబాద్‌, విశాఖపట్నం పోలీసు కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో తొందరపడొద్దని స్పష్టం చేసింది.

సెట్‌టాప్‌ బాక్స్‌ల కొరత తీవ్రంగా ఉందని, సముచిత నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అఫ్జల్‌ పి.పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో సెట్‌టాప్‌ బాక్స్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గడువు పెంచిందని, మన రాష్ట్రం విషయంలో గడువు పెంచడం లేదని కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ మార్కెట్లో సెట్‌టాప్‌ బాక్స్‌ల కొరత లేదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయని తెలిపారు. కొత్తగా గడువు పెంచాల్సిన అవసరం లేదని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X