నాన్సెన్స్.. నోరు అదుపులో పెట్టుకో.. రెచ్చిపోయిన కౌశల్, బాబు గోగినేని

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Serious Conversation Between Geetha & Babu Gogineni

తెలుగు బిగ్‌బాస్‌లో 47వ రోజు రచ్చ రచ్చగా మారింది. ఇంటి సభ్యుల మధ్య ముఖ్యంగా బాబు గోగినేని, కెప్టెన్ గీతా మాధురి, కౌశల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఈ గొడవలపై గీతా మాధురి సీరియస్ అయ్యారు. కెప్టెన్‌గా నా మాట వినండి. నన్ను గౌరవించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఏమి జరిగిందంటే..

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిర్వహించాడు. అందులో భాగంగా ఇంటిలోని స్విమ్మింగ పూల్‌లో ఫాగ్ స్పే బాటిల్స్ పెట్టి వాటిని ఇంటి ముందు ఉన్న టేబుల్‌పైకి ఎవరు ఎక్కువ చేరుస్తారో వారు విజేతలుగా నిలుస్తారు అని తెలిపారు.

కౌశల్ జట్టు గెలుపు

కౌశల్ జట్టు గెలుపు

లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ముగ్గురు చోప్పున జట్లుగా విడిపోవాలి. ఎక్కువ ఎవరు స్పే బాటిల్స్‌ను పైకి తెస్తారో వారికి లగ్జరీ వస్తువులు అందుతాయని బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం.. గేమ్ ఆరంభించారు. ఈ గేమ్‌లో కౌశల్, దీప్తి, నందిని టీమ్ గెలిచింది. వారికి లగ్జరీ బడ్జెట్ వస్తువులు అందాయి.

బిగ్‌బాస్ ఇంట్లో లగ్జరీ చిచ్చు

బిగ్‌బాస్ ఇంట్లో లగ్జరీ చిచ్చు

లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇంటి సభ్యుల్లో చిచ్చు పెట్టింది. ఈ వస్తువులను అందరూ ఉపయోగించుకోవడానికి కౌశల్ జట్టుకు ఇష్టమేనా అని అడుగగా.. వారు సరే అన్నారు. కానీ మా జట్టు గెలిచినప్పుడు బాబు గోగినేని, తనీష్ నాకు కంగ్రాట్స్ చెప్పకపోవడం బాధగా ఉంది. ఇంటి సభ్యులందరూ ఓ టీమ్‌గా ఉండాలని ఓ సూచన చేయడంతో గొడవ ప్రారంభమైంది.

కంగ్రాట్స్ చెప్పలేదని కౌశల్

కంగ్రాట్స్ చెప్పలేదని కౌశల్

ఎవరికైనా కంగ్రాట్స్ చెప్పాలన్నది నా మనసులో ఉండాలి. నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను అని బాబు గోగినేని గట్టిగా అరిచారు. దాంతో ఆయనను గీతా మాధురి గట్టిగా హెచ్చరించింది. దాంతో గొడవ కాస్త పెరిగింది. ఓ దశలో బాబు గోగినేని రెచ్చిపోయి నాన్సెన్స్ అనే పదాన్ని వాడారు. దాంతో అలాంటి పదాలు వాడకూడదు అని గీతా హెచ్చరించింది.

బూతులు వాడొద్దు

బూతులు వాడొద్దు

నాన్సెన్ అనేది బూతు కాదు.. చెడు మాట కాదు అని బాబు గోగినేని అన్నాడు. నాన్సెన్ అనేది వాడకూడదు. అలాంటి మాటలు ఉపయోగిస్తే ఇంట్లో వాతావరణం చెడిపోతుంది అని గీతా సూచించింది. నాకు మనసుకు నచ్చినట్టు మాట్లాడుతాను. మీరు నాకు ఏమీ చెప్పకూడదు అని బాబు సమర్థించుకొన్నారు.

మైండ్ యువర్ లాంగ్వేజ్

మైండ్ యువర్ లాంగ్వేజ్

ఇలా బాబు, గీతా మాధురి మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో కౌశల్‌ మధ్యలో దూరడంతో బాబు మరికాస్త స్వరం పెంచారు. స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ మళ్లీ అరిచారు. దానికి మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ కౌశల్ హెచ్చరించారు.

గీతా, కౌశల్‌ను బయటకు పంపుతాను

గీతా, కౌశల్‌ను బయటకు పంపుతాను

ఆ తర్వాత బాబు గోగినేని సామ్రాట్, తనీష్ మరికొందరితో మాట్లాడుతూ.. శనివారం నేను ఉంటానో లేదో తెలియదు. కానీ నేను మాత్రం బిగ్‌బాస్ నుంచి కౌశల్‌ను, గీతా మాధురిని బయటకు పంపడానికి నా శాయశక్తులు ఉపయోగిస్తాను. ఇక నాకు అదే పని అని బాబు గోగినేని శపథం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X