సుడిగాలి సుధీర్ కి ముద్దు.. హైపర్ ఆదికి హగ్గు.. అబ్బా అనిపించిన హెబ్బా!
బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. జబర్దస్త్ నుంచి దాదాపు అందరినీ తీసుకెళ్లి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేయిస్తోంది మల్లెమాల. వారానికి ఒకసారి ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఈ వారం హెబ్బా పటేల్ గెస్ట్ గా రాగా ఆమెతో సందడి చేయించారు నిర్వాహకులు. ఆ వివరాల్లోకి వెళితే

ఎక్కడా తగ్గకుండా
ఈటీవీలో మల్లెమాల వాళ్ళు చేస్తున్న దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ హిట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ప్రోగ్రాములు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అందులో భాగంగానే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక ప్రోగ్రాం మొదలు పెట్టారు. మొదట అనేక అవాంతరాలు ఎదుర్కొన్న ఈ షోకి ప్రస్తుతం సుధీర్, ఇంద్రజ, హైపర్ ఆది వంటి వాళ్లు మూలస్తంభాలుగా నిలిచి ఎక్కడా ఆగకుండా మంచి రేటింగ్స్ అలాగే యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చే విధంగా కంటెంట్ సిద్ధం చేస్తున్నారు

హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సినీ పరిశ్రమకు లేదా టెలివిజన్ పరిశ్రమకు దూరం అయిన వారికి మంచి రీ-ఎంట్రీ కర్టెన్ రైజర్ గా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతోంది. అందులో భాగంగానే తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రకారం 29వ తేదీ విడుదల కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరైంది. తెలుగులో కుమారి 21 ఎఫ్ సినిమా ద్వారా పరిచయమైన హెబ్బా పటేల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

రీ ఎంట్రీ కోసం
ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ బాగోలేకనో లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది అందులో భాగంగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె కనిపించింది. ఈ క్రమంలో సుధీర్ మాట్లాడుతూ నేను హీరోగా యాక్ట్ చేస్తే మీరు హీరోయిన్ యాక్టింగ్ చేయాలి అని అడుగుతాడు.
ఫ్లయింగ్ కిస్
దానికి ముందు ఆమె అర్థం కానట్లు ఫేస్ పెట్టడంతో ప్రోగ్రాంకి హాజరైన ఆమని నువ్వు నచ్చలేదు అనుకుంటా అందుకే చేయను అంటోంది అని అంటుంది. వెంటనే విషయం అర్థమైన హెబ్బా పటేల్ అదేమీ లేదు బాగా నచ్చావ్ అంటూ ఫ్లయింగ్ కిస్ కూడా సుదీర్ కు ఇస్తుంది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది, రాంప్రసాద్ ఇద్దరూ కూడా హెబ్బా పటేల్ ను ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగానే ఆనవాయితీ ఏమిటో హైపర్ ఆది చెబుతాడు అంటాడు.

హైపర్ ఆదికి హగ్
అలా అనగానే హైపర్ ఆది అందుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాగానే ముందు బావలకు హగ్ ఇవ్వాలి అని అంటాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా హెబ్బా పటేల్ హైపర్ ఆదికి హగ్ ఇస్తుంది. దీంతో హైపర్ ఆది ఏదో జరిగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. తర్వాత పొట్టి నరేష్ కూడా వచ్చి తనకు కూడా ఒక ఫ్రెండ్లీ హగ్ ఇవ్వాలని కోరడంతో నరేష్ కు కూడా హెబ్బా పటేల్ హగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. హెబ్బా పటేల్ ఎక్కడ తగ్గకుండానే అబ్బా అనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











