బిగ్ బాస్ 3 లో హాట్ భామ.. శ్రీముఖికి పోటీగా! యూత్‌కి పండగే..

Recommended Video

Bigg Boss Telugu 3 : Tollywood Crazy Actress Into Bigg Boss House || Filmibeat Telugu

బుల్లితెర పాపులర్ షో 'బిగ్ బాస్'కి సంబందించి రోజుకో ఆసక్తికర వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే నాగార్జునను హోస్ట్‌గా ప్రకటిస్తూ ప్రోమోలు విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. 100 రోజుల పాటు సాగనున్న ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో బిగ్ బాస్ పార్టిసిపెంట్ లిస్ట్ అంటూ ప్రతీ రోజు ఓ కొత్త పేరు బయటకొస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హాట్ బ్యూటీ హెబ్బాపటేల్ ఈ షోలో భాగం కానుందని తెలుస్తోంది..

శ్రీముఖి, సావిత్రి గుడ్ బై.. కారణమిదే

శ్రీముఖి, సావిత్రి గుడ్ బై.. కారణమిదే

'బిగ్ బాస్ 3' పార్టిసిపెంట్స్ గురించిన ఎన్నో విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లిస్టులో తెలంగాణ తీన్మార్ పిల్ల సావిత్రి, హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఉందనే సమాచారం హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి సావిత్రి, శ్రీముఖిలతో సంప్రదింపులు కూడా జరిగాయని, అందుకే శ్రీముఖి పటాస్ షోని, సావిత్రి తీన్మార్ షోని వదులుకున్నారని వార్తలు వస్తున్నాయి.

 కుమారి 21 F బ్యూటీ.. హెబ్బా

కుమారి 21 F బ్యూటీ.. హెబ్బా

కుమారి 21F సినిమాతో కుర్రకారు గుండెల్లో గ్లామర్ బ్యూటీగా స్థిర పడిపోయింది హెబ్బా పటేల్. ఆ తర్వాత అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని పలు సౌత్ సినిమాల్లో గ్లామర్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది హెబ్బా. దీంతో అమ్మడికి యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. హెబ్బా ఉందంటే సెగలు పుట్టించడం ఖాయం అని ఫిక్సయ్యాయారంతా.

హాట్ యాంకర్ శ్రీముఖికి పోటీగా హెబ్బాపటేల్

హాట్ యాంకర్ శ్రీముఖికి పోటీగా హెబ్బాపటేల్

అయితే తాజాగా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్ లిస్ట్ లో హెబ్బా పటేల్ పేరు వినిపిస్తుండటంతో అందం, అట్రాక్షన్ పరంగా హాట్ యాంకర్ శ్రీముఖికి హెబ్బాపటేల్ పోటీగా నిలుస్తుందనే టాక్ మొదలైంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు హెబ్బాపటేల్ తో సంప్రదింపులు కూడా చేశారని సమాచారం అందుతోంది. ఇదే జరిగితే బుల్లితెర యూత్ ఆడియన్స్‌కి పండగే మరి.

ఫైనల్ లిస్ట్.. నెలాఖరులో ప్రారంభం

ఫైనల్ లిస్ట్.. నెలాఖరులో ప్రారంభం

బుల్లితెర ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈ నెలాఖరులో బిగ్ బాస్ సీజన్ 3 పేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X