Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తప్పు చేస్తే చేయి నరికేయాల్సిందే.. హేమతో శ్రీముఖి ఘాటుగా కామెంట్
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమై మూడు రోజులు కాలేదు.. కానీ ఎన్నో హాట్ వార్తలకు వేదికగా నిలిచింది. కొద్ది రోజుల్లోనే ఎన్నో రోజుల్నుంచి వైరం వ్యక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. మూడు రోజులుగా నెలకొన్న గందరగోళం మధ్య జాఫర్, హేమ, శ్రీముఖి, మహేష్ విట్ట, బాబా భాస్కర్ తదితరులు హాస్యాన్ని పండించే చిన్న స్కిట్‌ను ప్రదర్శించారు. వారు వేసిన చిన్న తమాషా ఎపిసోడ్ నవ్వులు పూయించింది. ఇంతకు ఆ ఎపిసోడ్ ఏమిటంటే..
బాబా భాస్కర్ వెన్నుపోటు కాదు
ఇంటిలో నెలకొన్న సభ్యులు గురించి మాట్లాడుతూ.. అందరూ ముందు పోటు పొడిస్తే.. బాబా భాస్కర్ ముందు పోటు పొడుస్తున్నారు అని అన్నారు. బాబా భాస్కర్ ది వెన్నుపోటు అంటూ హేమ చెప్పారు. దాంతో బాహుబలి స్కిట్‌కు బీజం పడింది. బిగ్‌బాస్ ఇంటిలోని లాన్లో చేరిన శ్రీముఖి, బాబా భాస్కర్, హేమ, జాఫర్, మహేష్ విట్ట ఆటవిడుపుగా బాహుబలి స్కూప్ చేశారు.
ఇంట్లో బాహుబలి స్కిట్ వేసి
బాహుబలి స్కిట్లో ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ నటించారు. హేమను హేమసేనగా సంభోదిస్తూ ఏం వంట చేశావు అంటూ అడిగారు. ఆ క్రమంలో హేమ స్పందిస్తూ.. ప్రభువా అనగానే అందరూ పకపకా నవ్వారు. హేమ, జాఫర్ మధ్య జరిగిన సంభాషణ ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.
జాఫర్, హేమ గందరగోళం
బాహుబలి స్కిట్లో జాఫర్, హేమ డైలాగ్‌లు చెప్పడానికి తడబడ్డారు. జాఫర్ డైలాగ్ చెప్పగా అందులో పవర్ లేదంటూ ఆటపట్టించారు. డైలాగ్ ఎలా చెప్పాలో ఆ ఇద్దరికి బాబా భాస్కర్, శ్రీముఖి సహాయం చేశారు. లైట్, కెమెరా, ట్రాలీ అంటే టేక్ చెప్పారు. ముఖాలకు టచప్ చేశారు. పదే పదే డైలాగ్స్ చెప్పడంలో తడబడినప్పుడల్లా దొబ్బింది అంటూ శ్రీముఖి అనడం కనిపించింది.
రాహుల్ చేయి నరికేశాను
స్కిట్‌ను మొదలుపెట్టి హేమ సేన ఏం వండితివి అనగానే.. రోజు ఏం వండినా ఏదో ఒకటి వంక పెడుతున్నారు. అందుకే అతడి చేయి కోశాను అని హేమ అన్నారు. అతను ఎవరంటే రాహుల్ సిప్లిగంజ్ చేయి నరికేశాను అంటూ సమాధానం ఇచ్చింది.అంతలోనే హేమ సేన నీ మీద అరిస్తే నరకాల్సింది తల కాదు.. జాఫర్ తడబడ్టాడు. దాంతో అందరు నవ్వుల్లో మునిగిపోయారు. మీరంతా ఇలా చేస్తే ప్రొడ్యూసర్ నెత్తిన గుడ్డ వేసుకోవడం ఖాయం అన్నారు.