బిగ్ బాస్ అంతా చీటింగ్.. వైరల్ అవుతున్న హేమ షాకింగ్ కామెంట్స్
Recommended Video
పలు వివాదాల నడుమ జులై 21 వ తేదీన ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 15 మంది కంటిస్టెంట్స్, హోస్ట్ నాగార్జున బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో మొదటి రోజు నుంచే కంటిస్టెంట్ల నడుమ మాటల యుద్దాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో తొలి వారం బిగ్ బాస్ నుంచి సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన అనంతరం సరదాగా, పాజిటివ్ గా కనిపించిన హేమ.. తాజాగా బిగ్ బాస్‌పై కొన్ని సంచలన ఆరోపణలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ హేమ చేసిన ఆరోపణలు ఏంటి? వివారాల్లోకి పోతే..

బయటకొచ్చేటపుడు నో ఎమోషన్స్
బిగ్ బాస్ హౌస్ నుంచి తొలి వారమే హేమ ఎలిమినేట్ కావడం బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చింది. కానీ హేమ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపించింది. హేమ ఎలిమినేట్ అయిందని హోస్ట్ నాగార్జున ప్రకటించిన తర్వాత హేమ ముఖంలో పెద్దగా ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించలేదు. తాను కిచెన్ లో ఓ తల్లిలా బెహేవ్ చేశానని, మిగితా కంటిస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి హేమ వెనుదిరిగింది.

బయటకొచ్చాక సంచలన ఆరోపణలు
తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు హేమ బిగ్ బాస్ హౌస్ పై సంచలన కామెంట్స్ చేశారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగింది జరిగినట్లుగా చూపించకుండా వేరే రకంగా చూపించి కన్ఫ్యూషన్ లో పడేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ నటి హేమ.

ప్రారంభం రోజు నుంచే పెత్తనం
బిగ్ బాస్ నిర్వాహకులు ప్రారంభం నుంచే నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. మొదటి రోజు నా ఏవీని ప్రసారం చేయలేదు. నా ప్రమోషన్ కి సంబంధించి ప్రోమో వేస్తామని అది కూడా వేయలేదు. బిగ్ బాస్ హౌస్ లోపల గొడవ జరిగినప్పుడు, కంటిస్టెంట్లకు నేను సర్ది చెబితే దానిని మార్చేసి నేనే గొడవ చేసినట్లు చూపించారు. షో ప్రారంభం నుంచే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది అని హేమ అన్నారు.

ఎలిమినేషన్ విధానంలో అవకతవకలు
కంటిస్టెంట్లను ఎలిమినేషన్ చేసే విధానంలో అవకతవకలు జరిగాయని.. తనకే అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు హేమ. గత సీజన్లలో లాగే చాలా మంది గూగుల్ ద్వారా ఓటు వేయడానికి చూశారని, అయితే హాట్ స్టార్ ద్వారా ఓటు వేయాలని మొదట చెప్పకపోవడంతో ఆడియన్స్ లో కన్ఫ్యూజ్ నెలకొందని అన్నారు హేమ. బిగ్ బాస్ నుండి తాను ఒకటి ఆశిస్తే అక్కడకు వెళ్లాక ఇంకోటి జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నటి హేమ.

తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి హేమ ఎలిమినేషన్ కాగానే.. ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చారు. తమన్నాను బిగ్ బాస్ హౌస్ లోకి హోస్ట్ నాగార్జున ఆహ్వానించడం జరిగింది. బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన తమన్నా.. తనకు తాను నిరూపించుకోవడానికి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొంటాను అని చెప్పారు.

మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో
మొదటి నుంచే వివాదాల నడుమ హాట్ టాపిక్ గా మారిన బిగ్ బాస్ ఇష్యు.. తాజాగా హేమ ఎలిమినేషన్ తర్వాత మరిన్ని చర్చలకు తావిస్తోంది. ఈ లోగా హేమ చేసిన షాకింగ్ కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో స్టార్ మాలో ప్రసారం కాబోయే హేమ ఇంటర్వ్యూలో ఇంకా ఇలాంటి నిజాలు ఎన్ని బయటపెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











