బిగ్ బాస్‌పై మరోసారి విరుచుకుపడిన హేమ.. రమ్మన్నారు కానీ..! సంచలన వ్యాఖ్యలు
ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముట్టిన బిగ్ బాస్ సీజన్ 3 నేటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. జులై 21 వ తేదీన ప్రారంభమై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ షో ఏదో ఒక రూపంలో పలు చర్చలకు కారణమవుతోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కొందరు కంటిస్టెంట్స్ అదే బిగ్ బాస్‌పై సంచలన కామెంట్స్ చేస్తుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ నటి, బిగ్ బాస్ కంటిస్టెంట్ హేమ మరోసారి విరుచుకుపడటం హాట్ టాపిక్ అవుతోంది.

తొలివారం హేమ అవుట్.. మళ్ళీ ఇప్పుడు
==బుల్లితెర పాపులారిటీ షోగా పేరొందిన బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్.. 15 మంది కంటిస్టెంట్లతో మొదలైంది. అందులో ఒకరుగా ఉన్న హేమ.. తొలి వారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయినా సంగతి తెలిసిందే. తన ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. మళ్ళీ ఇప్పుడు `బిగ్‌బాస్ 3`ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

చివరి దశలో బిగ్ బాస్.. హేమ సంచలనం
పద్నాలుగో వారం ఫినిష్ చేసుకున్న బిగ్ బాస్ షో పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలో బిగ్ బాస్ గురించి, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటిస్టెంట్స్ గురించి హేమ చేసిన కామెంట్స్
పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

నిర్వాహకుల తీరుపై మండిపడుతూ..
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ.. బిగ్‌బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. బిగ్‌బాస్ షో ఎడిటరే బిగ్‌బాస్ అని చెబుతూ, బిగ్ బాస్ నిర్వాహకులు చెడును మాత్రమే చూపిస్తున్నారని.. ఆ షో రూల్స్ అలాగే ఉంటాయని తెలిపింది. ఫైనల్‌కు రావాలని మళ్లీ తనకు పిలుపు వచ్చినా.. వెళ్లి అవమానపడటం ఎందుకని ఆహ్వానాన్ని తిరస్కరించానని తెలిపింది.

బిగ్ బాస్‌లో పాల్గొన్న వారంతా..
ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారెవ్వరూ సక్సెస్ కాలేదని హేమ పేర్కొంది. ఏదో ఒకటి రెండు ఓపెనింగ్ లకు పోవడం తప్ప.. ఎవ్వరూ హీరోలు కాలేదని, ఎవ్వరికీ లైఫ్ రాలేదని చెప్పింది. ఎందుకంటే బిగ్ బాస్‌లో చూపించేది అంతా చేదు మాత్రమే అని సంచలన ఆరోపణ చేసింది హేమ.

మళ్ళీ శ్రీముఖిపై పడిన హేమ
ఇక శ్రీముఖిపై కూడా మరోసారి కామెంట్స్ చేసింది హేమ. శ్రీముఖి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతుందని చెప్పింది. ఆమె గేమ్ ప్లాన్‌లో అందరూ బలవుతున్నారని అనేసింది. సరిగ్గా బిగ్‌బాస్ ఫైనల్‌కు ముందు హేమ ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











