Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న అడివి శేష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలతో వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడూ విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ.. సూపర్ హిట్లు కొట్టే ఆయనకు కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందర్ అంటే అడివి శేష్ కు చాలా ఇష్టం. వారి ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడిందో.. తొలిసారి అడివి శేష్ చెప్పాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2002లో సొంతం అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు హీరో అడివి శేష్. ఆ తర్వాత కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో, ఇంజి ఇడుపళగి, క్షణం, ఊపిరి, అమీ తుమీ, గూఢచారి, ఓ బేబీ, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అలాగే కిస్ అనే సినిమాకు ఈయనే దర్శకత్వం వహించారు. ఇలా అద్భుతమైన సినిమాలతో వస్తూ కెరియర్ లో దూసుకుపోతున్న ఈయన తాజాగా ఉస్తాద్ అనే షోకు వచ్చాడు.

Hero Adivi Sesh Reveal First Time How He Became Friends With Pawan Kalyan Son Akeera Nandan

ఇక్కడే తనకు అకీరా నందన్ తో స్నేహం ఎలా ఏర్పడిందో చెప్పాడు. అది మాత్రమే కాకుండా తనకు సినిమా చేసే అవకాశం వస్తే అకీరా నందన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తానని వివరించాడు. ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటున్న అకీరా నందన్.. అడివి శేష్ స్నేహితురాలికి ఫ్యామిలీ ఫ్రెండ్ అంట. అలా ఓసారి తన స్నహేతురాలి ఇంటికి వెళ్లినప్పుడు అకీరా నందన్ కలిశాడట. అప్పుడే తామిద్దరూ సినిమాల గురించి మాట్లాడుకున్నట్లు చెప్పాడు అడివి శేష్.

అకీరా నందన్ చాలా స్మార్ట్ అని, ఫుల్లీ టాలెంటెడ్ అని అడివి శేష్ తెలిపాడు. తన సినిమాలోని ఓ పాటను వాయించి తనకోసం పంపించాడని.. బ్రిటీష్, స్పానిష్, తమిళ్, తెలుగు, కన్నడ... ఇలా అన్ని మ్యూజిక్స్ గురించి అకీరాకు బాగా తెలుసు అని అలాగే పుస్తకాలు కూడా చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాడని అడివి శేష్ వెల్లడించాడు. అకీరా టాలెంట్ చూస్తే తనకు చాలా ముచ్చటేస్తుందని.. అలాగే తాను తలెత్తుకుని చూసేలా చేసిన ఒకే ఒక్క పిల్లాడు అకీరా నందన్ అని చెప్పుకొచ్చాడు. తాను 6.2 పొడువు కాగా.. అకీరా 6.4, 6.5 ఉంటాడని వివరించాడు.

Hero Adivi Sesh Reveal First Time How He Became Friends With Pawan Kalyan Son Akeera Nandan

అకీరాను కలిసినప్పటి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని.. తను చదివే పుస్తకాలు సజెస్ట్ చేస్తే తాను కూడా కచ్చితంగా చదువుతుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే తాను ఓ స్టోరీ రాసి పెట్టుకోగా.. అది పవన్ కల్యాణ్ కు, అకీరాకు ఇద్దరికీ వినిపించానని చెప్పాడు. అది వాళ్లిద్దరికీ నచ్చిందని.. కానీ తాను ఆ స్టోరీని అకీరాతో చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్ తో కూడా ఈ సినిమా చేయలేనిన.. ఆయన తన అభిమాన హీరో కాగా.. అకీరా తన హార్ట్ అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X