కొడుకు మాట విన్నందుకు 90 కోట్లు.. అక్షయ్‌ను వెంటాడిన అదృష్టం!
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ వరుస చిత్రాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. గత రెండేళ్లుగా బాక్సాఫీస్‌ను కుదిపేస్తూనే అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొంటున్నాడు. అలాగే ఆయన నటించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలకు నోచుకొంటున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ సరికొత్త పాత్రను పోషించడానికి సిద్దమవుతున్నాడు. అందుకోసం అక్షయ్‌కు భారీ మొత్తం ముట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

అమెజాన్ ఆఫర్‌పై అక్షయ్ కుమార్
ప్రస్తుతం డిజిటల్ మీడియా క్రేజీగా మారింది. వెబ్ సిరీస్‌లకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడుతున్నది. అక్షయ్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలోపెట్టుకొన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అతడిని డిజిటిల్ ప్లాట్ ఫాంపైకి లాగేందుకు వెంటాతున్నది. అయితే అక్షయ్ చాలా సార్లు అమెజాన్ ఆఫర్‌ను నిరాకరించాడు.

తండ్రి అక్షయ్‌ని ఒప్పించిన ఆరవ్
తండ్రి అక్షయ్ కుమార్ డిజిటల్ ఫ్లాట్ ఫాం ఆఫర్ నిరాకరించాడనే విషయం తెలుసుకొన్న కుమారుడు ఆరవ్ రంగంలోకి దిగాడట. డిజిటల్ మీడియా, వెబ్ సిరీస్ పెరుగుతున్న డిమాండ్ గురించి తండ్రిని ఒప్పించాడట. దాంతో అమెజాన్‌తో ఒప్పందం కుదర్చుకోవడంతో రూ.90 కోట్లకుపైగా రెమ్యునరేషన్ ముట్టచెప్పారట.

త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో
అక్షయ్ కుమార్‌తో అతిపెద్ద షోను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రారంభించబోతున్నాం. అత్యంత భారీ థ్రిల్లర్‌ను రూపొందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రేక్షకులు సీట్లకు హత్తుకొని చూడటం ఖాయం అని అమెజాన్ నిర్వాహకులు వెల్లడించారు.

కాన్సెప్ట్ నచ్చి.. కొడుకు చెప్పడంతో
అమెజాన్ ప్రైమ్ చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఆ షోలో నటించేందుకు ఒప్పుకొన్నాను. అమెజాన్ బృందంతో కలిసి పనిచేస్తున్నాను. యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ షూటింగ్ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నాను. నా కుమారుడి సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నాను అని అక్షయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సల్మాన్ ఖాన్‌కు అమెజాన్ వల
మరో సరికొత్త కాన్సెప్ట్‌తో అమెజాన్ ప్రైమ్ సిద్ధమవుతున్నది. ఈ షో కోసం సల్మాన్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే మరికొందరు బాలీవుడ్ స్టార్లతో చర్చలు జరుగుతున్నాయి. డిజిటల్ మీడియాను కొత్త పుంతలు తొక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని అమెజాన్ నిర్వాహకులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











