Alitho Saradaga Season 2 : సీక్రెట్‌గా ప్రభాస్‌తో మల్టీస్టారర్.. బిగ్ లీక్ చేసేసిన గోపిచంద్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్‌తో మెప్పించిన ఆయన ఆ తర్వాత హీరోగా రాణిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. కానీ కొంతకాలంగా ఆయన సరైన హిట్ పడలేదు. అయితే ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లలో గోపిచంద్ - ప్రభాస్ ముందు ఉంటుంది. వీరిద్దరి కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా దీనిపై గోపిచంద్ క్లారిటీ ఇచ్చారు. ఆలీతో సరదాగా షో సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో ఆయన పాల్గొని ఈ విషయాన్ని చెప్పారు.
ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మ్యాచో స్టార్ గోపిచంద్. తొలి సినిమాలో హీరోగా నటించినా ఆ తర్వాత నిజం, జయం, వర్షం చిత్రాలలో విలన్ రోల్స్‌తో స్టార్ స్టేటస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా మారి కెరీర్లో ముందుకెళ్లడం ప్రారంభించారు. అలా హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. కానీ ఆయన కెరీర్ ఒడుదొడుకులతోనే సాగుతోంది.

అయితే ఇండస్ట్రీలో ఆయనకు దొరికిన అరుదైన గొప్ప స్నేహం ప్రభాస్ అని చాలా మంది అంటుంటారు. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ కూడా తమ చక్కని స్నేహా బంధం ఎలాంటిదో చెప్పారు. వర్షం సినిమా కోసం తొలిసారి వీరిద్దరు కలిశారు. అక్కడి నుండి వీరి స్వచ్ఛమైన స్నేహబంధం మొదలైంది. సాధారణంగా సిగ్గరి అయిన గోపిచంద్‌కు తనకన్నా ఎక్కువ బిడియం ఉన్న ప్రభాస్‌తో స్నేహం బాగా కుదిరింది.
దీంతో ఈ ఇద్దరి స్నేహితుల బంధం అభిమానులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఇద్దరు కూడా సేమ్ కటౌట్, హైట్‌తో ఏక్ దమ్గా ఉంటారు. అందుకే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తే చాలు చూడాలనేది ఎంతో మంది అభిమానుల కల. కానీ దీని కోసం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడంతో ఆయన మరింత బిజీ అయిపోయారు.

దీంతో వీరిద్దరి కాంబోలో ప్రాజెక్ట్ వస్తుందన్న ఆశను కూడా వదిలేశారు ఫ్యాన్స్. అయితే ఎట్టకేలకు ప్రభాస్‌తో కలిసి మల్టీస్టారర్‌పై ఓ హింట్ ఇచ్చారు గోపిచంద్. దీంతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవతున్నారు. ప్రస్తుతం గోపిచంద్ భీమా అనే సోషియో ఫాంటసీ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచినా గోపిచంద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా తాజాగా ఆలీతో సరదాగా సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్నారు.
ఇందులోనే ప్రభాస్‌తో సినిమా గురించి మాట్లాడారు. "మీ ఇద్దరి కలిసి సినిమా చేస్తున్నారని బయట వార్తలు వచ్చాయి. మా దగ్గర పోస్టర్ కూడా ఉంది" అని అలీ అనగా గోపిచంద్ సరదాగా "మసాజ్ తాయి మసాజ్" అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అలాగే తాను ఎంతో మందిని ఉచితంగా చదివిస్తున్నట్లు చెప్పారు. ఇక మరో ఇంటర్వ్యూలోనూ ప్రభాస్‌తో సినిమా గురించి మాట్లాడారు గోపిచంద్. "నేనైతే ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ. భవిష్యత్‌లో అవుతుంది. అయితే ఎలాంటి సినిమానో, కథో చెప్పలేను. మాఇద్దరి కూడా కలిసి చేయాలని ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాం" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











