యాంకర్ సుమపై చేయి చేసుకున్న స్టార్ హీరో: మెడ పట్టుకుని మరీ ఘోరంగా.. షోలో సంచలన సంఘటన
పేరుకు మలయాళినే అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ.. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోంది సుమ కనకాల. స్పాంటీనియస్‌గా పంచులతో దాడి చేస్తూ.. సెటైర్లతో ఎదుటి వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ.. ఇప్పటికీ అదే రీతిలో హవాను చూపిస్తూ సాగిపోతోంది. ఫలితంగా మరిన్ని ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో టాలీవుడ్‌లోని ఓ పేరున్న హీరో యాంకర్ సుమపై చేయి చేసుకున్నాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
రెండు దశాబ్దాల ప్రస్థానం:తెలుగు బుల్లితెరపై ఎవరికీ సాధ్యం కాని రీతిలో సుమ.. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, ఇమిటేషన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేసి ప్రేక్షకులను చేరువైంది.

అక్కడ బిజీగా ఉన్నా సరే:సుదీర్ఘ కాలంగా తెలుగులో టాప్ యాంకర్‌గా ఉన్న సుమ.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది. దీంతో సుమ వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇలా ఎన్నో సినిమా ఈవెంట్లను చేస్తున్నా.. టీవీ షోలకు కూడా సుమ ప్రాధాన్యం ఇస్తూనే ఉంది.
'సుమ అడ్డా'తో కొత్తగానే:సుమ యాంకర్‌గా చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అని తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అలాంటిది ఈ షోను ఇటీవలే నిలిపేశారు. దీని స్థానంలో 'సుమ అడ్డా' అనే షోతో సుమ కొత్తగా వచ్చేసింది.

సుమ షోలోకి రామబాణం:వచ్చే శనివారం ప్రసారం కానున్న 'సుమ అడ్డా' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో త్వరలోనే 'రామబాణం' అనే సినిమాతో రాబోతున్న హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి, డైరెక్టర్ శ్రీవాస్, గెటప్ శ్రీనులు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో కలిసి సుమ తెగ సందడి చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రోమోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.
సుమపై వరుస పంచులు:తమ 'రామబాణం' సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం 'సుమ అడ్డా' షోకి వచ్చిన గోపీచంద్.. యాంకర్ సుమపై పంచుల వర్షం కురిపించాడు. ఆమె ఏజ్, గ్లామర్ గురించి ఎన్నో సెటైర్లను పేల్చాడు. దీంతో 'పంచిగ్ పలక్‌నామాకే పంచులా' అన్నట్లుగా ఆమె ముఖం పెట్టేసింది. అంతేకాదు, ఈ షోలో ఇచ్చే డబ్బు నిజమైందా? కదా? అని దొంగతనంగా చూసి యమ నవ్వించాడు.

బొమ్మరిల్లు.. విలన్‌గానే:ఈ షోలో అంతా కలిసి 'బొమ్మరిల్లు' స్ఫూఫ్ చేశారు. అప్పుడు శ్రీవాస్ 'మొత్తం మీరే చేశారు. మేము ఎక్కడ నిల్చోవాలో మీరే చెప్తారు. ఏం మాట్లాడాలో మీరే చెప్తారు' అన్నాడు. తర్వాత గోపీచంద్ కూడా కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత సుమ 'జయం' సినిమా స్ఫూప్ చేయమని హీరోను అడగ్గా.. నువ్వు వచ్చావు కాబట్టి నేను హీరోగా కాదు.. విలన్‌గా చేయడమే బెటర్ అన్నాడు.
సుమ పీక పట్టుకున్నాడు:'సుమ అడ్డా' షోలో భాగంగా చివర్లో 'భార్య ఎలాంటి విషయాల్లో భర్తపై అలుగుతుంది' అని సుమ ఓ ప్రశ్న అడిగింది. దీనికి డింపుల్, శ్రీవాస్ కలిసి ఓ ఆన్సర్ చెప్పారు. అది తప్పు అని గోపీచంద్ అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు, ఆ తర్వాత సుమ పీక పట్టుకుని సీరియస్ అయ్యాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











