Bigg Boss 7: బిగ్ బాస్ షో కోసం ఆ హీరోకు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్... అన్ని వందల కోట్లా?

బిగ్ బాస్.. ఈ షో మొదట హాలీవుడ్ బుల్లితెరపై ప్రారంభం అయి... తర్వాత మన దేశానికి వచ్చింది. హిందీలో మొదట ప్రారంభం కాగా.. సౌత్ రాష్ట్రాలకు కూాడా ఈ షో వచ్చింది. అయితే బిగ్ బాస్ హోస్టు చేయడానికి ఓ హీరో తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే... దిమ్మతిరగాల్సిందే. ఆ హీరో ఎవరు... ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇది మొదట హాలీవుడ్ లో ప్రారంభం అయింది. అక్కడ సక్సెస్ కావడంతో మన ఇండియాలోనూ ఈ షోను ప్రవేశపెట్టారు. ఇక హిందీలో ప్రారంభం అయిన ఈ షో ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక సౌత్ భాషలకు కూడా ఈ షో పాకింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్ బాస్ షో నడుస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సీజన్స్ పూర్తి చేసుకుంది కూడా.

Hero Kamal Haasans Mind-Blowing remuneration ₹120+ Crore Deal for Bigg Boss 7 Tamil 2023

ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తోంది. ఈ షోకు మొదట హోస్టుగా ఎన్టీఆర్ చేయగా... తర్వాత నాని చేశారు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి 7వ సీజన్ వరకు నాగార్జున హోస్టుగా చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఆరుసీజన్స్ పూర్తి కాగా.. ఒక ఓటీటీ వర్షన్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 7వ సీజన్ ఉల్టా పుల్టా అంటూ నిర్వహాకులు గేమ్ ను కొత్తగా నడిపిస్తున్నారు.

ఇక ఆ విషయాలు పక్కన పెడితే తమిళ బిగ్ బాస్ షో నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తమిళలంలో ప్రస్తుతం ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఏడవ సీజన్ కు సిద్ధం అయింది. బిగ్ బాస్ అంటేనే... కొత్త కొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్‌, కాంట్రవర్సీస్‌, వినోదాలతో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపడేస్తుంటుంది. మరి తమిళ్ లో 7వ సీజన్ వచ్చేనెల 1 వ తేదీన ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే బిగ్ బాస్ 7 తమిళ్ నుంచి విడుదల అయిన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూరైనట్లు సమాచారం. అయితే తమిళంలో మొదటి నుంచి బిగ్ బాస్ షోను హోస్టు చేస్తుంది లోకనాయకుడు కమల్ హాసన్. మరి ఆయన గత 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏడో సీజన్ కోసం సిద్ధం అయ్యారు. అయితే బిగ్ బాస్ తమిళ్ 7 సీజన్ కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

kamalhassan

కమల్ హాసన్ ఈ సీజన్ కోసం 120కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ 700 కోట్లు తీసుకుంటుండగా.. కమల్ సౌత్ లో అత్యధికంగా 120 కోట్లు తీసుకుంటున్నారు. ఇది విన్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇక ఒక్కో ఎపిసోడ్ కు ఆయన 40కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాల్లో బిజిబిజిగా గడుపుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన... త్వరలో ఇండియన్ 2 గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X