Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ స్టేజీపై కార్తి.. అందమైన అశ్విని పుల్లలు పెడుతుందట, రైతుబిడ్డ అపరిచితుడంట!
బిగ్ బాస్ తెలుగు 7 గురించి అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన సెలబ్రిటీలను తీసుకొచ్చి ఓ ఇంట్లో పెట్టి, అద్భుతమైన టాస్కులు ఇస్తూ ఆడించే ఆటే బిగ్ బాస్. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనే కాకుండా చాలా భాషల్లో ఈ షో కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి కాగా.. తాజాగా ఏడో సీజన్ ప్రసారం అవుతోంది. గతంలో ఏ సీజన్ కూ లేని టీఆర్పీ ఈ సీజన్ కు వస్తుంది. తాజాగా ఎనిమిదో వారం కూడా పూర్తి చేసుకునేందుకు సిద్ధమైన ఈ షోలో వీకెండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడే విడుదల అయింది.
అందులో బాబు బంగారం.. మా బాబూ బంగారం అంటూ సాగే పాటకు కింగ్ నాగార్జున, హీరో కార్తి కలిసి రావడం మనం చూడొచ్చు. అంటే శనివారం ఎపిసోడ్ లో హీరో కార్తి ఎంట్రీ ఇచ్చారు. కార్తి తాజాగా చేసిన జపాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ షోకు వచ్చినట్లు అర్థం అవుతోంది. కార్తి రావడాన్ని చూసిన ప్రేక్షకులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్లు అయితే తెగ సంబరపడిపోతూ కనిపించారు. ఈక్రమంలోనే నాగార్జున చాలా కామెడీ చేశారు.

నీ జపాన్ సినిమాలో లోని క్యారెక్టర్లే ఈ ఇంట్లో కూడా చాలా ఉన్నాయని చెబుతాడు. వెంటనే కార్తి.. అంటే డార్క్, డార్కెన్, డార్కెస్టా అంటూ అందరినీ నవ్వించాడు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కార్తిని చూసి ఎగ్జైట్ అయిపోయారు. హీరో కార్తిని ఇంట్రడ్యూస్ చేస్తూ నాగార్జున.. మా తమ్ముడిని తీసుకొచ్చానని చెబుతాడు. ఆ తర్వాత కార్తి మాట్లాడుతూ.. ఈసినిమాలో గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి... కానీ అన్నీ డార్కే అని అంటాడు. వెంటనే నాగార్జున అందుకొని మా హౌస్ లాగే అంటాడు. దీనికి కూడా అంతా ఘొల్లుమని నవ్వారు.
ఈ హౌస్ మేట్స్ డార్క్ సైడ్ తోనే వీరిని పరిచయం చేస్తానంటూ చెప్పిన నాగార్జున.. ముందుగా అశ్వినిని పరిచయం చేస్తాడు. ఏ ఫర్ అశ్విని అందిమైన ఆడపిల్ల అనగానే తెగ మెలికలు తిరిగిపోయిందీ ముద్దుగుమ్మ. కానీ వెంటనే అందరికీ పుల్లలు పెడుతుందంటూ చెప్పి షాక్ కు గురి చేస్తాడు. కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం లే అనగానే ఆమె సైలంట్ అయిపోతుంది. ఆ తర్వాత కార్తి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెబుతాడు. నాగార్జున సార్ అందరినీ పొగుడుతారని.. ముఖ్యంగా తమన్నా సెట్ లోకి అడుగు పెట్టగానే తమన్నా యూ సో బ్యూటిఫుల్ అనగానే ఆమె పడిపోతుందని వివరించాడు.

ఆ తర్వాత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి చెబుతూ.. ఇప్పుడు మనం చూస్తున్నది రామమ్.. నామినేషన్స్ సమయంలో అపరిచితుడు కనిపిస్తాడంటూ కామెడీ చేశాడు. దానికి రైతుబిడ్డ కూడా నవ్వాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు డార్క్ సైడ్ చెబుతానంటూ... శోభా శెట్టి గురించి మాట్లాడతాడు. తేజ నువ్వు చెప్పు అంటే... సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండని అంటాడు. నిజాయితీగా శోభా డార్క్ సైడ్ చెప్పు అంటూ ఆట పట్టిస్తాడు. మీరనుకున్నదే సార్ అని తేజ అనగా... కార్తి మైండ్ వాయిస్ వినిపించిందా అని అంటాడు. దీంతో మరోసారి ఇల్లంతా నవ్వులు విరబూసాయి. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











