Bigg Boss 7 Telugu: నాగార్జున నోట సమంత పేరు... ఇక నైనా ఆపండ్రా బాబు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఇక ఈ బిగ్ రియాలిటీ షోకు నాగార్జున హోస్టుగా వ్యవహారించనున్నారు. మరికొన్ని గంటల్లో ఈ షో ప్రారంభం కానుండగా... ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో గెస్టులుగా ఖుషి టీం నుంచి విజయ్ దేవరకొండ, మిస్టర్ పొలిశెట్టి, మిస్ శెట్టి నుంచి నవీన్ పోలిశెట్టి వచ్చారు. ఈ ప్రోమోలో నాగార్జున నోట సమంత పేరు వస్తుంది. దీన్ని బట్టి చూస్తే... వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ రియాలిటీ బిగ్ షో మరికొద్ది గంటల్లో ప్రసారం కానుంది. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ ప్రోమో బయటకి రాగా.... ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్ కన్నా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని మరింత జోష్ ఫుల్ గా చేయడానికి నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ కూడా గెస్టులుగా వచ్చారు.

Hero Nagarjuna Talk About Heroine Samantha Ruth Prabhu in Bigg Boss Telugu Season 7 Promo

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ నేపథ్యంలోనే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు నవీన్. ఇక నవీన్ నాగ్ కి మధ్య ఫుల్ ఫన్ మాటలు నడిచాయి. ఆ తర్వాత ఖుషి మూవీతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ కూడా... టైటిల్ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు.

Hero Nagarjuna Talk About Heroine Samantha Ruth Prabhu in Bigg Boss Telugu Season 7 Promo

నాగార్జున, విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ... సమంత గురించి అడగడం ప్రోమోలో ఆసక్తిని కలిగించింది. మరి తన మాజీ కోడలు గురించి నాగార్జునకి విజయ్ దేవరకొండ ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడో షోలో చూడాల్సిందే. అయితే గత కొంత కాలంగా నాగార్జున ఫ్యామిలీ , సమంత మధ్య వార్ నడుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

Hero Nagarjuna Talk About Heroine Samantha Ruth Prabhu in Bigg Boss Telugu Season 7 Promo

నాగ్ నోట సమంత మాట రావడంతో.. వారి మధ్య స్నేహం అలాగే ఉందని తెలుస్తోంది. నాగ చైతన్య, సమంత మధ్య ఇలా అలా అంటూ... వార్తలు వస్తున్నాయి. ఇకనైనా ఆపండ్రా బాబు అని నెటిజన్స్ అంటున్నారు. వారు అంతా బాగానే ఉంటారు కానీ... మధ్యలో రూమర్స్ సృష్టించి వార్తలు రాసి.. అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

Hero Nagarjuna Talk About Heroine Samantha Ruth Prabhu in Bigg Boss Telugu Season 7 Promo

ఇక నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండతో పాటు స్కంద మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ పోతినేని, శ్రీలీల, బోయపాటి శ్రీను కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారు. హీరోయిన్ శ్రీయ, సమజవరాగమనా ఫేమ్ రెబా మోనికా జాన్, వైష్ణవి చైతన్య, రాహుల్ సిప్లిగంజ్, గీత మాధురిల నుంచి స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు ఉండున్నాయి. ఈ పవర్ ప్యాక్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ సీజన్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ ఆడిపోవడం గ్యారెంటీ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X