For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమ పరువు తీసేసిన హీరో నాని: ఏ మాట అనకూడదో అదే అనేశాడు.. దెబ్బకు బిత్తరపోయిన యాంకరమ్మ

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ హోస్టుగా వెలుగొందుతోంది సుమ కనకాల. గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంప్రదాయంగా కనిపిస్తూనే యువ యాంకర్లకు పోటీ ఇస్తుందామె. అంతేకాదు, వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నేచురల్ స్టార్ నాని యాంకర్ సుమకు కోలుకోలేని షాకిచ్చాడు. ఏ మాట అనకూడదో అదే అనేసిన అతడు ఏకంగా పరువు తీసేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అన్నీంట్లోనూ టాప్.. యాంకర్లలో తోప్

  అన్నీంట్లోనూ టాప్.. యాంకర్లలో తోప్

  గ్లామరస్ బ్యూటీలు యాంకరింగ్ రంగంలో సత్తా చాటుతోన్నా.. సుమ ఇంకా నెంబర్ వన్ స్థానంలోనే వెలుగొందుతోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆమెకున్న అద్భుతమైన టైమింగ్ అని చెప్పొచ్చు. ఎంతటి వాళ్లపైన అయినా పంచులు వేయగల నైపుణ్యమే సుమను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా అన్ని విద్యలనూ ప్రదర్శిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

  ఎక్కడ చూసినా సుమనే కనిపిస్తోందిగా

  ఎక్కడ చూసినా సుమనే కనిపిస్తోందిగా

  బుల్లితెరపై వరుస షోలతో బిజీగా మారిపోయిన సుమ కనకాల.. మరెవరకీ సాధ్యం కాని రీతిలో దూసుకుపోతోంది. ఒక్క టీవీ షోలు మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతోందీ టాప్ యాంకర్.

  అందులో మాత్రం ఆసక్తి చూపించలేదు

  అందులో మాత్రం ఆసక్తి చూపించలేదు

  యాంకర్ సుమకు యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, డైలాగ్ డెలివరీ ఇలా పలు అంశాల్లో బాగా పట్టున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత టాలెంట్, ఫేమ్ ఉన్నా ఆమె మాత్రం సినిమాల్లో నటించడం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ... ఇప్పుడు మాత్రం ఆ వైపు తిరిగి చూడడం లేదు. అయితే, ఆ మధ్య ‘విన్నర్' మూవీ కోసం ఓ పాటను పాడిందామె.

  ప్రొఫెషనల్‌గానే కాదు... పర్సనల్‌గానూ

  ప్రొఫెషనల్‌గానే కాదు... పర్సనల్‌గానూ

  నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట... పెద్దల అంగీకారంతో అగ్నిసాక్షిగా ఒక్కటైంది. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్ చూసుకుంటూనే కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇద్దరు పిల్లల తల్లైనా సరే సుమ తన బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ బెస్ట్ ఉమెన్ అనిపించుకుంటోంది.

  సుమ చేసే షోలల అది చాలా స్పెషల్‌గా

  సుమ చేసే షోలల అది చాలా స్పెషల్‌గా

  ప్రస్తుతం సుమ హోస్ట్ చేస్తున్న షోలలో ‘క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఇందులో ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ వీడియోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. ఒక్కో వారంలో అయితే ఇవి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. రేటింగ్ కూడా తెచ్చుకుంటోందీ షో.

  సుమ కనకాల పరువు తీసిన హీరో నాని

  సుమ కనకాల పరువు తీసిన హీరో నాని

  వచ్చే వారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ‘టక్ జగదీష్' మూవీ నుంచి హీరో నాని, రితూ వర్మ, శివ నిర్వాణ, తిరువీర్ గెస్టులుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లు కూడా ఆమెకు ధీటైన ఆన్సర్లు చెబుతూ పంచులు వేశారు. ఈ క్రమంలోనే హీరో నాని.. సుమ పరువును తీసేశాడు.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  ఏ మాట అనకూడదో అదే అనేశాడుగా

  ఏ మాట అనకూడదో అదే అనేశాడుగా

  ‘క్యాష్' షోలో భాగంగా సుమ మాట్లాడుతూ.. ‘ఆంటీ అని పిలవడం అమ్మాయిలకు కూడా ఇష్టముండదు' అని అంది. దీనికి వెంటనే స్పందిన నాని.. సుమను ఆంటీ అని పిలిచేశాడు. అంతేకాదు, ‘సుమ ఆంటీ అంటే నాకు ఇష్టం. ఆమె యాంకరింగ్ బాగుంటుంది' అన్నాడు. ఆ తర్వాత ఆమె రిక్వెస్ట్ చేయగా.. ‘సరే ఆంటీ అని పిలవను.. పిన్ని అంటాను' అంటూ పరువు తీసేశాడు నాని.

  English summary
  Tuck Jagadish Movie Unit Nani, Ritu Varma and other participants in Anchor Suma Cash Show. In This Show Nani Called Suma Aunty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X