Anchor Pradeep Marriage: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఆధారాలతో లీక్ చేసిన టాలీవుడ్ స్టార్

సాధారణంగా బుల్లితెరపై వచ్చే యాంకర్లలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. అందుకే వాళ్ల పోటీని తట్టుకుని నిలబడడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ తెలుగులో తనదైన యాంకరింగ్‌తో స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే వాక్చాతుర్యం, అప్పటికప్పుడు పంచులు వేయగల టాలెంట్‌తో అతడు ముందుకు సాగుతోన్నాడు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి ఓ టాలీవుడ్ హీరో రివీల్ చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

బుల్లితెరపై ప్రదీప్ స్పీడ్:ఆరంభంలోనే బెస్ట్ యాంకర్ అనిపించుకున్న ప్రదీప్ మాచిరాజు.. ఆ తర్వాత వేరే వాటిలోకి కూడా ప్రవేశించాడు. అలా ఎన్నో రకాల షోలను హోస్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ యంగ్ టాలెంటెడ్ యాంకర్ వరుస షోలతో సందడి చేస్తూనే ఉన్నాడు. అందులో ఇప్పుడు 'ఢీ 16' సహా పలు షోలు, ఈవెంట్లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

 Hero Nani Comments on Anchor Pradeep Machiraju Marriage in Dhee Show

హీరోగా హిట్.. లేట్‌గానే:తనదైన హోస్టింగ్‌తో తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్న ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా వచ్చి హిట్ కొట్టాడు. కానీ, ఆ తర్వాత మాత్రం గ్యాప్ తీసుకున్నాడు.

ఆ షోలో హవా చూపిస్తూ:యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇప్పుడు ఈటీవీలో ప్రసారం అవుతున్న 'ఢీ ప్రీమియర్ లీగ్' అనే డ్యాన్స్ రియాలిటీ షోలో హోస్టుగా అలరిస్తున్నాడు. ప్రతి బుధవారం ప్రసారం అవుతున్న ఈ షోలో ప్రదీప్ నెక్ట్స్ లెవెల్‌లో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పంచులు, ప్రాసలు, లుక్స్‌తో మెస్మరైజ్ చేసేస్తున్నాడు.

 Hero Nani Comments on Anchor Pradeep Machiraju Marriage in Dhee Show

యాంకర్ ప్రదీప్ పెళ్లిపై:తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రదీప్ పెళ్లి చేసుకోనని చెప్పినా కూడా ఈ ప్రచారాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అని:చాలా ఏళ్ల నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడి పెళ్లి ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని టాలీవుడ్ స్టార్ హీరో నాని వెల్లడించాడు. తాజాగా 'ఢీ ప్రీమియర్ లీగ్' ఫినాలేకు గెస్టుగా వచ్చిన అతడు.. యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి అతడితో పాటు అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

నీ పెళ్లి నెక్ట్స్ ఇయరే:'ఢీ' షోలో భాగంగా నానిని యాంకర్ ప్రదీప్ 'మీ వైఫ్ అలిగితే ఆమెను బుజ్జగించడానికి మీరేం చేస్తారు' అని ప్రశ్నించాడు. దీనికి నేచురల్ స్టార్ 'నెక్ట్స్ ఇయర్ నీ పెళ్లి అని రూమర్స్ వచ్చాయి' అన్నాడు. దీంతో ప్రదీప్ 'అవి చాలా ఏళ్లుగా వస్తున్నాయి' అనగా.. నాని 'ఈ రూమర్ మాత్రం చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది' అని చెప్పాడు. దీంతో ప్రదీప్ 'ఎవరు చెప్పినా పర్లేదయ్యా.. మీరు చెప్తే జనాలు' అంటూ దండం పెట్టేశాడు. ఇది నిజమో కాదో కానీ.. ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X