Bigg Boss Finale Guest: ఫినాలేకు మరో టాలీవుడ్ స్టార్ హీరో.. మూడేళ్ల తర్వాత మళ్లీ బిగ్ బాస్‌లోకి రాక

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఐదో సీజన్ సైతం అదే రీతిలో స్పందనను అందుకుంటోంది. ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీనికి ఎంతో మంది గెస్టులుగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరాయన? ఆ సంగతులు మీకోసం!

 ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య పోటీ

ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య పోటీ

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడుతున్నారు.

అతడే విజేత అంటూ ప్రచారాలు

అతడే విజేత అంటూ ప్రచారాలు

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో విజేత అయ్యేది ఎవరన్న దానిపై ఆరంభం నుంచీ ఎన్నో రకాల చర్చలు జరిగాయి. అయితే, చివరి దశకు చేరుకున్న తర్వాత మాత్రం ఈ సీజన్‌లో వీజే సన్నీనే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఫినాలే వీక్‌లో అతడికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. అలాగే, షణ్ముఖ్ రెండో స్థానంలో ఉంటాడట.

 ఆదివారం గ్రాండ్ ఫినాలే సందడి

ఆదివారం గ్రాండ్ ఫినాలే సందడి

దాదాపు పదిహేను వారాల పాటు అలరించిన బిగ్ బాస్ ఐదో సీజన్ డిసెంబర్ 19 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

వాళ్లతో రచ్చ చేయడానికి ఏర్పాటు

వాళ్లతో రచ్చ చేయడానికి ఏర్పాటు


ఆదివారం సాయంత్రం నుంచి జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిందని సమాచారం.

ఎంతో మంది గెస్టులు వస్తున్నారు

ఎంతో మంది గెస్టులు వస్తున్నారు

అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే స్పెషల్ గెస్టులుగా వస్తున్నారని అన్నారు. అలాగే, రాజమౌళి కూడా వస్తారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

బిగ్ బాస్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్

బిగ్ బాస్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్

బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను గతంలో కంటే ఎక్కువ సర్‌ప్రైజ్‌లతో ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని కోసం వీలైనంత ఎక్కువ మంది గెస్టులను తీసుకు రాబోతున్నారట. ఇందులో భాగంగానే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన సందడి చేయబోతున్నాడని అంటున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగబోతుంది.

 అప్పుడు హోస్టుగా.. ఇప్పుడు ఇలా

అప్పుడు హోస్టుగా.. ఇప్పుడు ఇలా

బిగ్ బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అతడు మళ్లీ యాంకరింగ్ చేయనని చెప్పాడు. దీంతో మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. అప్పుడలా బిగ్ బాస్‌కు దూరమైన నాని.. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్ కోసం స్టేజ్‌పై కనువిందు చేయబోతున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X