‘ప్రేమలో పడితే మిగిలేది పులిహోరే... ఏ రూమ్ దగ్గరికి వెళ్లినా సౌండ్లే’
జై సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నవదీప్. ఆ తర్వాత మొదటి సినిమా, గౌతమ్ ఎస్ఎస్‌సీ, సీతాకోకచిలుక, చందమామ, ఆర్య 2, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ సక్సెస్‌ను కంటిన్యూ చేయడంలో ఇబ్బందిపడిన నవదీప్.. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. అయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ, బుల్లితెర, ఓటీటీలు, బిజినెస్‌లతో బిజీ అయ్యారు నవదీప్. తాజాగా ఆయన నటించిన చిత్రం దండోరా. డిసెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవదీప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రేమలో పడితే పులిహోరే
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నవదీప్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్రవంతి చొక్కారపు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నవదీప్ సమాధానిమస్తూ.. ముందుగా ఈ సినిమా 2 గంటల 4 నిమిషాల నిడివితో వస్తోంది. ఇక మా సినిమా ఎందుకు చూడాలంటే.. మనం చాలాసార్లు ప్రేమలో పడతాం.. ఏమవుతుంది పులిహోర అవుతుంది. అలా అని ప్రేమలో పడటం మానేస్తామా? మళ్లీ మళ్లీ ట్రై చేస్తాం. ప్రతి ప్రేమ కొత్తదే, ప్రతి సినిమా కొత్తదే అని నవదీప్ తెలిపారు.

నేను మహా తుంటరిని
ఎందుకు రావాలి అనేదానికి ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూశారు ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఉదయం నుంచి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మా గ్రూప్‌లో చాలా డిస్కషన్స్ నడుస్తోంది. నాకొచ్చే క్వశ్చన్ లాంటిది మిగతావాళ్లకు ఎందుకు రావడం లేదు అని నవదీప్ అడగ్గా.. మీరు లవ్ గురు అని స్రవంతి ఆన్సర్ ఇచ్చింది. నాలో ఒక తుంటరితనం ఉందని తుంటరివాళ్లే ఎక్కువగా నాకు రెస్పాండ్ అవుతుంటారు మీలాగా. ఈ సినిమాకు ఎందుకు రావాలి అంటే మేటర్ ఉంది. ప్రొడ్యూసర్ యాంగిల్‌లో చెప్పాలంటే సినిమా రెడీ అయిన దగ్గరి నుంచి సినిమాను దాచుకుంటూ ఉంటారు. మహా అయితే రిలీజ్‌కు ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేస్తూ ఉంటారు అని నవదీప్ అన్నారు.
మా సినిమాలో ఏదో ఉందని నమ్ముతున్నారు
కానీ మా ప్రొడ్యూసర్ మొత్తం అందరికీ చూపించేశారు. యాక్టర్స్, యాక్టర్స్ ఫ్రెండ్స్, మీడియా, పీఆర్ ఇలా షోల మీద షోలు వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి అంత ధైర్యం ఉంది. సినిమాకు డబ్బులు పెట్టినవాడికి అందరికంటే ఎక్కువ టెన్షన్ ఉండాలి.. ఏంటీ పరిస్థితి, డబ్బులు వస్తాయా? వస్తే ఎంత వస్తాయని. మా ప్రొడ్యూసర్‌కి ఆ గొడవే లేదు, అందరికీ సినిమాను చూపించేశారు. సినిమా బాగుందని అందరూ చెబుతున్నారు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో ఏముందో ఫిక్స్ అయిపోతున్నారు. అలా ఇండస్ట్రీ వాళ్లు, ప్రేక్షకులు మా సినిమాలో ఏదో మేటర్ ఉందని ఫిక్స్ అయ్యారు అని నవదీప్ వ్యాఖ్యానించారు.
100 రూమ్‌లు వెతికా
మరో క్వశ్చన్‌లో కట్ అయిన సెన్సార్ డైలాగ్ చెప్పమని అడిగింది స్రవంతి. దానికి నవదీప్ ఆన్సర్ ఇస్తూ.. నేను ఇండియాలో లేను, రాత్రే వచ్చాను. జర్మనీలో ఎక్కడో? ఏదో పనిలో ఉండగా మా డైరెక్టర్ ఫోన్ చేసి చిన్న సెన్సార్ కట్ వచ్చింది.. దానిని కరెక్ట్ చేసి పంపించు అని అడిగారు. ఫస్ట్ నాకు పంపినప్పుడు నేను బోటు మీద ఉన్నా.. ఆ బోటులో సైలెంట్‌గా ఉన్న రూమ్‌లో నుంచి చేసి పంపించు అని చెప్పారు. మొత్తం బోటు అంతా వెతికా, 100 రూమ్‌లు ఉన్న బోటులో ఇంజిన్ రూమ్‌లో సాధారణంగానే సౌండ్ ఉంటుంది. దాంతో ఏ రూమ్ దగ్గరికి వెళ్లి చూసినా సౌండ్ వస్తూనే ఉంది. అయినప్పటికీ చేసి పంపించినా అది వర్కవుట్ కాలేదని నవదీప్ అన్నారు.
ఆ డైలాగ్‌కి సెన్సార్ కట్
నెక్ట్స్ అడిగినప్పుడు బస్‌లో ట్రావెల్ చేస్తున్నా.. అప్పుడు కూడా కుదరలేదు. మొత్తానికి మ్యూనిక్‌లో ఓ పంజాబీ రెస్టారెంట్‌లో ఉన్నా. అప్పుడు వాడు ఫుల్ సౌండ్ పెట్టాడు. కొంచెం సౌండ్ తగ్గిస్తే రికార్డ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేయగా వాడు సరేనని అన్నాడు. ఓ రూమ్‌లోకి వెళ్లి రికార్డ్ చేసి పంపించా. కానీ అది కూడా వర్కవుట్ కాకపోవడంతో ఇండియా వచ్చాక చేసి పంపించమని డైరెక్టర్ గారు చెప్పారు. సెన్సార్ కట్ అయిన డైలాగ్ డైరెక్టర్ గారే చెబుతారని నవదీప్ ఆయన దగ్గరికి వెళ్లగా.. సెన్సార్ అవ్వకుండా ఆ డైలాగ్ చెప్పకూడదని డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నవదీప్ సమయస్పూర్తిపై నెటిజన్లు డిఫరెంట్ ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











