రంగ్ దే ప్రేమ అంటూ నితిన్ రంగోలి జోష్.. మిఠాయి కొట్టు చిట్టెమ్మతో క్రేజీగా
లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో ఏ హీరోకు లేని విధంగా 2021లో భారీ రిలీజ్‌లు యంగ్ హీరో నితిన్ చేతిలో ఉన్నాయి. ఇప్పటికే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. మార్చి 26వ తేదీన రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో హీరోయిన్ కీర్తి సురేష్‌తో బిజీగా ఉన్నారు.
రంగే దే రిలీజ్ తర్వాత వస్తున్న హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నితిన్ డిసైడ్ అయ్యారు. కరోనా పరిస్థితులు ఉండటంత బయట వేడుకలకు అవకాశం లేకపోవడంతో జీ టెలివిజన్ నిర్వహించే రంగుల సంబరాల్లో నితిన్ పాల్గొంటున్నారు.

రంగోలీ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని రంగ్ దే ప్రేమ, మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనే స్పెషల్ షోను జీ టెలివిజన్ నిర్వాహకులు ప్లాన్ చేశారు.
మార్చి 28న ప్రసారమయ్యే రంగ్ దే ప్రేమ కోసం నితిన్ సెలబ్రిటీ గెస్ట్‌గా రానున్నారు. ఈ కార్యక్రమంలో తెల్లవారితే గురువారం చిత్ర యూనిట్ కూడా పాల్గొంటున్నారని జీ టెలివిజన్ వెల్లడించింది.
అలాగే జీ టెలివిజన్ మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనే మరో సరికొత్త సీరియల్‌ను ప్రారంభిస్తున్నది. వేణుగోపాల్ ఈ సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నారు. చిట్టమ్మగా (అంజనా శ్రీనివాస్) నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సిరియల్ మార్చి 29 సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతుంది.


Click it and Unblock the Notifications











