బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్‌గా వివాదాస్పద హీరో.. ఆయనొస్తానంటే, ఆవిడ ఊరుకుంటుందా..?

ప్రస్తుతం లావణ్య ఎపిసోడ్‌తో ఇంటా బయటా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు యువ హీరో రాజ్ తరుణ్. తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి కొత్తగా మాల్వీ మల్హోత్రా అనే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది. మరో అమ్మాయి ట్రాప్‌లో పడి తనను దూరం పెట్టాడని, తాను గర్భం దాల్చితే రాజ్‌ దగ్గరుండి అబార్షన్ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అన్విక అనే మారు పేరుతో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉన్నామని, విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. మెడికల్ రిపోర్ట్స్, 170కి పైగా ఫోటోలను ఆమె నార్సింగి పోలీసులకు సమర్పించారు. మాల్వీ , ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించారు.

తనపై లావణ్య పెట్టిన కేసు, చేసిన ఆరోపణలపై గతంలోనే రాజ్ తరుణ్ స్పందించారు. ఆమెతో రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని , కానీ తర్వాత డ్రగ్స్‌కి, చెడు వ్యసనాలకు లావణ్య బానిసవ్వడంతో దూరం పెట్టినట్లు చెప్పారు. తన ఫ్లాట్ కొట్టేయాలనే పథకంలో భాగంగానే ఈ డ్రామాలు ఆడుతోందని రాజ్ ఆరోపించారు. అటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా సైతం లావణ్య వ్యాఖ్యలను ఖండించింది. రాజ్ తనకు ఓ ఫ్రెండ్ మాత్రమేనని, అతనితో కలిసి పనిచేసిన హీరోయిన్లందరినీ లావణ్య వేధిస్తోందని పేర్కొంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

hero raj tarun may participate in nagarjuna hosted bigg boss telugu season 8

రాజ్ తరుణ్‌పై పలు సెక్షన్లపై పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసు ఇలా జరుగుతుండగానే లావణ్య ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. ట్విస్టుల మీద ట్విస్టుల మధ్యలో కొందరు కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్న గాక మొన్న రాజ్ ఫ్రెండ్‌నంటూ ఆర్జే శేఖర్ భాష ప్రత్యక్షమయ్యాడు. లావణ్య అతనికి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో రాజ్ తరుణ్ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలతో సతమతమవుతుడటంతో రాజ్ కెరీర్‌ డైలామాలో పడింది. ఈ నేపథ్యంలో అతనిపై ఓ ఛానెల్ కన్నేసి, ఓ షోలో అవకాశం ఇవ్వాలని చూస్తోందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది మరేదో కాదు.. స్టార్ మా. త్వరలో ప్రారంభంకానున్న బిగ్‌బాస్ -8 కోసం నిర్వాహకులు రాజ్ తరుణ్‌ని సంప్రదించినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

hero raj tarun may participate in nagarjuna hosted bigg boss telugu season 8

వివాదాస్పద వ్యక్తులు ఎక్కడున్న వెతికి పట్టుకొచ్చే బిగ్‌బాస్ నిర్వాహకులు.. మన హైదరాబాద్‌లోనే ఇంత కాంట్రవర్సీ నడుస్తుంటే ఊరుకుంటారా, వెంటనే రాజ్‌తరుణ్‌ని బిగ్‌బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరారన్నది ఆ వార్త సారాంశం. బిగ్‌బాస్ -8 కంటెస్టెంట్స్‌గా చాలా పేర్లు తెరపైకి వస్తున్నా , వారిలో ఎవరు ఫైనల్ అయ్యారో క్లారిటీ లేదు. గత ఎపిసోడ్ మాదిరే చివరి వరకు ఎవరి పేరు బయటకు రాకూడదని నిర్వాహకులు రహస్యంగా వ్యవహరిస్తున్నారు.

అయితే బిగ్‌బాస్ నిర్వాహకుల ప్రతిపాదనకు రాజ్ తరుణ్ ఓకే చెప్పారో , లేదో తెలియదు. ఓ వైపు వివాదాలు, కోర్టు కేసులు, మరోవైపు.. తను చేయాల్సిన సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెట్టేసి రాజ్‌తరుణ్ బిగ్‌బాస్‌ సెట్‌లో అడుగుపెడతారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రాజ్‌తరుణ్ కనుక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే బిగ్‌బాస్-8లో పసందైన వినోదం గ్యారంటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X