Bigg Boss 7 Telugu: రామ్‌ పోతినేనికి షాకిచ్చిన కంటెస్టెంట్.. బిగ్ బాస్ స్టేజ్‌పై ఊహించని సన్నివేశం

అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ ఇది సాగిపోతోంది. అందుకే తెలుగులో ఇది ఏకంగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హీరో రామ్‌కు ఓ కంటెస్టెంట్ షాకిచ్చాడు. ఆ వివరాలు మీరే చూడండి!

బిగ్ బాస్ షోలో సండే ఎపిసోడ్‌ అంటే ఫన్నీగా సాగుతుందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే గత ఎపిసోడ్ ఆద్యంతం సందడి సందడిగా సాగింది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో హీరో రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చాడు. అతడు నటించిన 'స్కంద' మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతుండడంతో ప్రమోషన్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాడు.

Hero Ram Shocks After Tasty Teja Dance in Bigg Boss 7 Telugu Show

హీరో రామ్ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు డ్యాన్స్ పోటీని పెట్టారు. ఇందుకోసం 12 మంది సభ్యులను 'ఇస్మార్ట్', 'స్కంద' అనే రెండు జట్లుగా విభజించారు. వీళ్లకు ఒక ట్యూన్ వినిపించగా.. దాన్ని ఎవరైతే ముందుగా గెస్ చేస్తారో.. వాళ్లు ప్రత్యర్థి టీమ్‌లోని ఒకరితో డ్యాన్స్ పోటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ల పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రామ్, నాగార్జున మార్కులు ఇస్తారు.

బిగ్ బాస్ హౌస్‌లో రామ్ నిర్వహించిన డ్యాన్స్ పోటీ ఆద్యంతం అద్భుతంగా సాగింది. ముఖ్యంగా సందీప్ మాస్టర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక, శోభా శెట్టి, రతికా రోజ్, శుభ, దామినిలు అదిరిపోయే డ్యాన్స్ చేసి రామ్‌ను మెప్పించారు. మిగిలిన వాళ్లు కూడా తమదైన రీతిలో అలరించారు. దీంతో ఈ ఎనర్జిటిక్ స్టార్ అందరినీ ఎంకరేజ్ చేసేలా మార్కులు ఇచ్చాడు.

మరీ ముఖ్యంగా ఈ డ్యాన్స్ పోటీలో 'స్వింగ్ జరా స్వింగ్ జరా' ట్యూన్‌ను శుభశ్రీ రాయగురు గెస్ చేసింది. ఆ వెంటనే ఆమె తనతో పోటీగా టేస్టీ తేజను రావాలని సవాల్ చేసింది. ఇక, ఈ పాటలో శుభశ్రీ ట్యూన్స్‌ను మ్యాచ్ చేస్తూ అదిరిపోయే డ్యాన్స్ చేసింది. మరోవైపు టేస్టీ తేజ మాత్రం అప్పట్లో జబర్ధస్త్‌లో ఊపేసినట్లు బాడీ మొత్తాన్ని ఊపుతూ గెంతులు వేశాడు.

టేస్టీ తేజ డ్యాన్స్ చూసిన రామ్ పోతినేని ముందుగా షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత అతడినే చూస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వేశాడు. బిగ్ బాస్ స్టేజ్‌పై అతడు ఎంజాయ్ చేసినట్లు గతంలో ఎప్పుడూ కనిపించలేదు. అంతలా రామ్‌కు టేస్టీ తేజ తన డ్యాన్స్‌తో షాకిచ్చాడు. ఇది అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ఈ ఎనర్జిటిక్ స్టార్ అతడిని మరోసారి డ్యాన్స్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. దీంతో తేజ మళ్లీ డ్యాన్స్ చేయగా.. రామ్ మళ్లీ మళ్లీ నవ్వుకున్నాడు. ఇక, దీని తర్వాత హీరో వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X