యాంకర్ సుమతో రానా చిల్లర మాటలు.. ఎవరూ ఇలా బిహేవ్ చేయలేదంటూ!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని హోస్టుగా వెలుగొందుతూ.. సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో దూసుకుపోతోంది యాంకర్ సుమ కనకాల. పంచులు, ప్రాసలు, తనదైన డైలాగులతో ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేస్తున్న ఈ చిన్నది.. ఇప్పటికీ భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది.

ఫలితంగా ఇంకా ఇంకా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ముఖ్యంగా 'సుమ అడ్డా' షోలో తనదైన అల్లరి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హీరో దగ్గుబాటి రానా.. యాంకర్ సుమకు షాకిచ్చాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

Hero Rana Daggubati Satires on Anchor Suma in Suma Adda Show

ఎవరికీ సాధ్యం కాని విధంగా: ఎవరికీ సాధ్యం కాని రీతిలో తెలుగు బుల్లితెరపై సుమ.. దాదాపు ఇరవై ఏళ్లుగా యాంకర్‌గా హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, ఇమిటేషన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేసి మజాను పంచుతోంది.

Hero Rana Daggubati Satires on Anchor Suma in Suma Adda Show

'సుమ అడ్డా' అని కొత్తగా: సుమ యాంకర్‌గా చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకంగా నిలిచేది. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అయింది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. అలాంటిది ఈ షోను ఇటీవలే నిలిపేసి.. దీని స్థానంలో 'సుమ అడ్డా' అనే షోతో సుమ సరికొత్తగా వచ్చేసింది.

Hero Rana Daggubati Satires on Anchor Suma in Suma Adda Show

సుమ షోలోకి పరేషాన్ టీమ్: వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న 'సుమ అడ్డా' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో త్వరలోనే 'పరేషాన్' అనే సినిమాతో రాబోతున్న హీరో తిరువీర్, హీరోయిన్ పావనీ కరణం, డైరెక్టర్ రొనాల్డ్‌సన్‌తో పాటు హీరో దగ్గుబాటి రానా గెస్టులుగా వచ్చారు. వీళ్లతో కలిసి సుమ తెగ సందడి చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రోమోకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

Hero Rana Daggubati Satires on Anchor Suma in Suma Adda Show

ఆమెపై పంచ్‌లు.. ఫన్నీగా: 'పరేషాన్' సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. అందుకే ప్రమోషన్స్ కోసం 'సుమ అడ్డా' షోకి వచ్చిన దగ్గుబాటి రానా.. యాంకర్ సుమపై పంచుల వర్షం కురిపించాడు. ఆమె ఏజ్, గ్లామర్ గురించి ఎన్నో సెటైర్లను పేల్చాడు. దీంతో ఆయన పంచులకు ఆమె ముఖం మాడిపోయింది. అంతేకాదు, ఈ షోలో ఎన్నో రకాల కామెంట్లు చేస్తూ రానా అందరినీ నవ్వించాడు.

బాహుబలి.. కామెడీ టైమ్: ఈ షోలో రానా, తిరువీర్‌తో కలిసి యాంకర్ సుమ 'బాహుబలి 2' స్ఫూఫ్ చేశారు. అందులో బాహుబలి తల నరికిన సీన్‌ను రీ క్రియేట్ చేశారు. అప్పుడు సుమను రానా ఏమైందని అడగ్గా.. 'బిర్యానీ పొట్లం కోసం లైన్‌లో నిల్చుంటే వీడు నన్ను తాకాడు. అప్పుడే వేలు నరికేశాను' అని చెబుతుంది. దీంతో రానా 'నరకాల్సింది వేలు కాదు.. బిర్యానీ ప్యాకెట్‌ను' అని పంచ్ వేశాడు.

Hero Rana Daggubati Satires on Anchor Suma in Suma Adda Show

చిల్లర పంచ్.. తొలిసారిగా: 'సుమ అడ్డా' షోలో భాగంగా క్వశ్చన్స్ అడిగే సమయంలో రానా ఓ ఐదు వందల రూపాయల నోటుతో కోట్ చేస్తూ కామెడీని పండించాడు. దీంతో సుమ 'ఈ షో చరిత్రలో ఇంత తక్కువ ఎమౌంట్ ఎవరూ కోట్ చేయలేదు' అని చెప్పింది. దీంతో రానా 'అయితే.. ఈ ఐదు వందలకు కూడా చిల్లర ఇవ్వు' అని మరో పంచ్ వేశాడు. దీంతో ఆమె నోరెళ్లబెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X