Bigg Boss 7 Telugu హౌస్ నుంచి వెళ్లిపోతా.. బిగ్‌బాస్‌కు హీరో శివాజీ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 7వ సీజన్ అట్టహాసంగా మొదలవ్వడం మాత్రమే కాకుండా ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ షోలో అప్పుడే టాస్కులు, నామినేషన్లు మొదలయ్యాయి. అయితే బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 4 వ రోజు హీరో శివాజీ వీరంగం సృష్ఠించాడు. హౌస్ నుంచి వెళ్లిపోతాను అంటూ ఏకంగా బిగ్‌బాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. శివాజీ కోపం వెనుక కారణం ఏమిటి? ఇంటిలో కాఫీ వ్యవహారం శివాజీని ఎలా ఇబ్బంది పెట్టిందనే వివరాల్లోకి వెళితే..
హీరో శివాజీ అందరితోను సరదాగా, హుందాగా ఉంటూ పెద్దరికం ప్రదర్శిస్తున్నాడు. తన కంటే చిన్నవారిని ప్రేమగా పిలుస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ ఇంటిలో 4వ రోజు ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు కాఫీ ఇవ్వకపోవడంతో హర్ట్ అయ్యాడు. నా ఇగోను దెబ్బ కొట్టాడు అంటూ శివాజీ రచ్చ చేశాడు. రతిక, పల్లవి ప్రశాంత్ ఎంత బుజ్జగించినా తనలోని వేడిని తగ్గించుకోలేకపోయాడు.

ఒక ఆర్టిస్టును ఇంటిలోకి తెచ్చి చిన్నచూపు చూస్తారా? నేను జనం కోసం పనిచేస్తాను. చాలా చాలా పెద్దోళ్లను చూశా. వారి వద్ద నుంచి వచ్చాను. అలాంటి నాకు కాఫీ ఇవ్వకుండా అవమానిస్తారా? అని శివాజీ గట్టి గట్టిగా అరిచాడు. అయితే రతిక బుజ్జగిస్తుంటే.. నాకు కాఫీ ఇవ్వమను.. నా ఇగో చల్లారుతుంది అని కామెంట్ చేశాడు. అయితే కాఫీ కంటే ముందు బ్రేక్ ఫాస్ట్ తిని బీపీ ట్యాబ్లెట్లు వేసుకో అంటే.. నేను బ్రేక్ ఫాస్ట్ తినను.. ఇంటి నుంచి వెళ్లిపోతా అంటూ శివాజీ వార్నింగ్ ఇచ్చాడు.
అయినా బిగ్‌బాస్ శివాజీ కామెంట్లను పట్టించుకోకుండా.. రితికకు ఓ స్టెత స్కోప్ ఇచ్చి ఓ టాస్క్ ఇచ్చాడు. అందరి గుండెలో ఏముందో చూడు.. ప్రతీ కంటెస్టెంట్ గుండెలో ఏం మాటలు ఉన్నాయో విను అంటూ సలహా ఇచ్చాడు. అయితే పాత స్టెత స్కోప్.. బీపీ మిషన్‌ను తీసి విసిరికొట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి డొక్కు మిషన్లతో బీపీ చూస్తారా?.. ఇప్పుడు ఇలాంటి పరికరాలు ఎవడు వాడటం లేదు అని శివాజీ అన్నాడు.
అయితే శివాజీ నోరు పెంచుతూ మాటలు వదులుతుంటే.. రతిక భయపడి పోయింది. అయితే బిగ్‌బాస్ కాఫీ ఇస్తావా? లేదా ఇంటి నుంచి వెళ్లిపోవాలా? అంటూ హెచ్చరించాడు. రతిక, ఇతర ఇంటి సభ్యులు ఆపేందుకు ప్రయత్నించినా.. వినలేదు. శివాజీ గాడు పీకినా పర్వాలేదు. కాఫీ ఇచ్చే వరకు తినను. పచ్చి మంచినీళ్లు కూడా తాగను అంటూ మొండికేశాడు.
రతిక వెంట పడుతుంటే.. అయితే నా గుండె చప్పుడు కూడా చూడు. స్టెత్ స్కోప్ పెట్టి చూడగానే.. అమ్మ, అక్కలను తిడుతున్నాడని చెబుతుందా?. బయటకు నా మాటలు రావడం లేదు గానీ.. అవే మాటలు వినిపిస్తుంటాయి. నేను ఇంత బాధపడుతుంటే.. రతిక కామెడీ చేయాలా? స్టెత్ స్కోప్ తో అందరి గుండెలు చూడాలా? అని గట్టిగా అరిచాడు. దాంతో రతిక భయపడి పోయింది. దాంతో బేటా నీకు ఎలాంటి ప్రాబ్లెం రాకుండా చూస్తాను అని శివాజీ ఓదార్చే ప్రయత్నం చేశాడు.
నేను బిగ్‌బాస్ తెలుగు ఇంటి నుంచి వెళ్లిపోతా.. మీరు కాఫీ ఇవ్వకుండా అవమానించారు. అలాంటి ప్రదేశంలో నేను ఉండను. బిగ్‌బాస్ నీవు అవమానించావు. గంటలో వెళ్లిపోతాను. నేను పోకుండా ఉంటానని అనుకోకు అని శివాజీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్ ఓ రూమ్‌లోకి పిలిచి మాట్లాడాడు. అనంతరం కప్పులో కాఫీ పంపించి శివాజీని కూల్ చేశాడు. కాఫీ కప్పు పట్టుకొని.. నేను సాధించాను అంటూ శివాజీ విజయగర్వం ప్రదర్శించాడు.


Click it and Unblock the Notifications











