Bigg Boss Telugu 7 Sivaji: బిగ్ బాస్ హౌస్‌లో హీరో, విలన్ అంటూ... మళ్లీ శివాజీ ఓవరాక్షన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ సీజన్ మొత్తం ఊహకు అందకుండా.. సరికొత్తగా బిగ్ బాస్ షో సాగుతోంది. ఇక ఈ సీజన్ లో హీరో శివాజీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక హౌజ్ లో అడుగుపెట్టిన మొదటి నుంచి ఆయన మైండ్ గేమ్ తో ఆటలు ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు. ఇక మరోసారి శివాజీ బిగ్ బాస్ హౌజ్ లో ఓవరాక్షన్ చేశాడు. హీరో, విలన్ అంటూ కామెంట్స్ చేస్తూ... బిగ్ బాస్ కే నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
మైండ్ గేమ్ తో... :బిగ్ బాస్ సీజన్ 7 నాలుగోవారం పూర్తి చేసుకుంది. ఇక ఐదో వారంలోకి ఎంటర్ అయింది. అయితే హీరో శివాజీ బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతూ.. ముందుకు వెళ్తున్నాడు. అసలు ఈ సీజన్ మొత్తంలో ఆయనకే రెమ్యూనరేషన్ ఎక్కువ. వారానికి ఆయనకు బిగ్ బాస్ నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇక అందుకు తగ్గట్లుగానే ఆయన ఎంటర్ టైన్ చేస్తున్నాడనే చెప్పవచ్చు.

ఓవరాక్షన్... :బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తూ... తాను సీనియర్ అని చెప్పుకునే ప్రయత్నం చేసేవాడు. ఇక సీరియల్ బ్యాచ్ ఒకవైపు అయితే శివాజీ బ్యాచ్ మరోవైపు. ఆయన కేవలం టెస్టీ తేజ, యావర్, ప్రశాంత్ లకు సపోర్ట్ చేస్తున్నట్లు పోట్రేట్ అయ్యాడు. ఇక మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. ముఖ్యంగా గౌతమ్ పై ఓ టాస్కులో తేజ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసినా.. హౌజ్ మేట్ అయినా శివాజీ మాత్రం చూస్తూ ఉండటం చర్చనీయంశం అయింది.

మరోసారి ఓవరాక్షన్:ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఆయన పవర్ అస్త్రను బిగ్ బాస్ వెనక్కి తీసుకుని.. కంటెస్టెంట్ చేశాడు. ఇక కంటెస్టెంట్ గా మారిన శివాజీ... వీఐపీ రూమ్ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఇక హౌజ్ మేట్స్ అయిన ప్రశాంత్, ఆట సందీప్, శోభా శెట్టి.. ఆయనకు డిలాక్స్ రూమ్ ఇచ్చారు. ఇక ఆ సందర్భంలోనే ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తో మరోసారి ఆయన ఓవరాక్షన్ బయటపడింది.

విలన్ హీరో అంటూ.. :తనని వాళ్లందరూ విలన్ లా చూడాలనుకుంటున్నారు... కానీ శివాజీ ఎప్పుడూ హీరోనే అంటూ బిగ్ బాస్ కే నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్... మళ్లీ శివాజీ ఓవరాక్షన్ మొదలు పెట్టాడురోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి.... అమర్ దీప్ ని నామినేట్ చేసి అతడితో కాస్త వాదన పెట్టుకున్నాడు. గ్రూపులు కడుతున్నారని.. హౌస్ లోకి రాకముందే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని వచ్చారని, ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు.

ఎంజాయ్ చేసి పోతా... :ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ... తాను బిగ్ బాస్ ప్రైజ్ గెలుచుకోవడానికి రాలేదని చెప్పుకు వచ్చాడు. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి వచ్చానని అన్నాడు. అంటే ఎలాను గెలవను, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి పోతానన్నట్లుగానే ఆయన మాట్లాడాడు. ఇక ఈ వారం శివాజీ... అమర్ దీప్, ప్రియాంకను నామినేట్ చేశాడు. ఇక అమర్ దీప్, గౌతమ్, ప్రియాంక్... శివాజీని నామినేట్ చేశారు.


Click it and Unblock the Notifications











