Bigg Boss Telugu 7 Finale : ఇది కదా అసలైన ఉల్టా పుల్టా.. కప్ కొడతాడు అనుకుంటే ఎలిమినేషనా?
బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సైతం ఉల్టా పుల్టాగానే సాగుతుంది. శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగిలిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆరవ స్థానంలో అర్జున్ అంబటి, 5వ స్థానంలో ప్రియాంక, 4వ స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 3వ స్థానంలో విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి.. ప్రేక్షకులకు సూపర్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభం అయిన బిగ్ బాస్ తెలుగు 7 రేపటితో ముగియనుంది. వంద రోజులకు పైగా బుల్లితెరపై, ఓటీటీలో సందడి చేసిన ఈ రియాలిటీ గేమ్ షో.. విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మొత్తం ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక ఈషోలో చివరగా టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్తారు అనుకోగా.. బిగ్ బాస్ మళ్లీ షాక్ ఇస్తూ.. టాప్ 6 కంటెస్టెంట్స్ ను ఫైనాలిస్టుగా డైసైడ్ చేశారు.

ఇక ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే శనివారం ఉదయం నుంచే అన్న పూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగలగా.... అయితే ఆరవ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యారు. ఫినాలే అస్త్ర సాధించి నేరుగా ఫైనలిస్ట్ అయినప్పటికీ.. టాప్ 6 స్థానం కేవసం చేసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో అర్జున్ అంబటి వైల్డ్ కార్డు కాకుండా.. డైరెక్ట్ గా వచ్చి ఉంటే టాప్ 2లోనైనా ఉండే వారని అంటున్నారు.

ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 5లో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయింది. ఈసారి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు. ఇక టాప్ 4 స్థానంతో యావర్ తప్పుకున్నాడు. బిగ్ బాస్ 15లక్షల సూట్ కేసు ఆఫర్ ఇవ్వడంతో... యావర్ తెలివైన నిర్ణయం తీసుకుని బిగ్ బాస్ గేమ్ నుంచి 15లక్షల సూట్ కేసుతో తప్పుకున్నాడు. అలా ఇక మిగిలింది మాత్రం టాప్ 3. శివాజీ, ప్రశాంత్, అమర్ మిగిలారు.
ఇక వీరిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఆసక్తిగా మారగా... ఇప్పుడు ఆ టాప్ 3 కంటెస్టెంట్స్ నుంచి మరో కంటెస్టెంట్ అవుట్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. హీరో శివాజీ. ఈయన విన్నర్ అవుతాడు అనుకుంటే.. ఇలా సీజన్ లో టాప్ 3 స్థానం కైవసం చేసుకున్నాడు. ఇక శివాజీ ఈ సీజన్ విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు. పల్లవి ప్రశాంత్ లేదంటే... శివాజీ ఇద్దరిలో ఒకరు విన్నర్ కానున్నారని ప్రచారం సాగింది.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా సీజన్ కావడంతో.. శివాజీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈసీజన్ లో శివాజీ మైండ్ గేమ్, కన్నింగ్ గేమ్ ఆడుతూ.. వచ్చాడు. ఇక ప్రశాంత్, యావర్ వంటి వారికి కోచింగ్ ఇస్తూ... ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. కానీ శివాజీ ఎలిమినేషన్ ప్రేక్షకులకు, అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఇక విన్నర్ అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరో ఒకరు కానున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











