హీరో శివాజికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. 8వ సీజన్‌ కోసం రంగంలోకి స్టార్

అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. దీనికితోడు ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుని.. ఈ ఏడాది మరో దానితో ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో గత సీజన్ కంటెంస్టెంట్ శివాజికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే....

ఆ సీజన్లన్నీ సూపర్ హిట్:ఇండియాలో ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్.. తెలుగులోనే మంచి విజయాన్ని అందుకుంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం విరామం లేకుండా సీజన్లను నడుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను ఇది కంప్లీట్ చేసింది. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా నిలిచి రికార్డులు కొట్టాయి.

Hero Sivaji Final For Bigg Boss Telugu 8 Buzzz Talk Show Host

ఏడోది నేషనల్ రికార్డుతో:గతంలో వచ్చిన సీజన్లు మంచి విజయాన్ని అందుకోవడంతో గత ఏడాది నిర్వహకులు ఏడో దాన్ని తీసుకొచ్చారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈ ఫినాలేకు దేశంలోనే టాప్ రేటింగ్ దక్కింది.

ఓటీటీ సీజన్.. ఆపేశారు:ఏడో సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి.. ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని అన్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సీజన్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Hero Sivaji Final For Bigg Boss Telugu 8 Buzzz Talk Show Host

8వ సీజన్ ముందుగానే:బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్ సక్సెస్ అయినా నిర్వహకులు ఓటీటీ వెర్షన్ సీజన్‌ను తీసుకు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదట. అందుకే ఎనిమిదో సీజన్‌ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మార్చి నుంచే పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఎలాగైనా జూలై లేదా ఆగస్టు నుంచి దీన్ని స్టార్ట్ చేస్తారని సమాచారం.

బిగ్ బాస్ బజ్ హోస్టు:బిగ్ బాస్ సీజన్ నడుస్తోన్న సమయంలోనే 'బిగ్ బాస్ బజ్' అనే టాక్ షోను కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. గతంలో తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ రవి, యాంకర్ శివ, గీతూ రాయల్ వంటి వాళ్లు దీన్ని హోస్ట్ చేశారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం కొత్త హోస్టును తీసుకోబోతున్నారు.

Hero Sivaji Final For Bigg Boss Telugu 8 Buzzz Talk Show Host

శివాజికి బంపర్ ఆఫర్:బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి మొదలెట్టబోయే బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగా ఎవరు ఉంటారన్న దానిపై చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ షోను శివాజి హోస్ట్ చేయబోతున్నాడట. ఈ విషయం తాజాగానే కన్ఫార్మ్ అయినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X