Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ సమర్పించు శివాజీ కోచింగ్ సెంటర్.. మరో విద్యార్థి బలి?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో.. సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక సీజన్ మొత్తం ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇక ఈ సీజన్ లో హీరో శివాజీ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎంటర్ అయిన మొదటి నుంచి ఆయన మైండ్ గేమ్ ఆడుతూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ లో రెండు బ్యాచ్ లు అయిపోయాయి. ఇక అందులో సీరియల్ బ్యాచ్ ఒకటి కాగా... రెండోది శివాజీ బ్యాచ్. మరి ఆ బ్యాచ్ లోకి మరికొంత మంది ఎంటర్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ హౌస్ లో మొదటగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక అందులో ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ అవ్వగా.. మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక హౌస్ లో మొదటి నుంచి సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ అని నడుస్తోంది. ఇక శివాజీ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతూ.. వస్తున్నాడు. మొదటి నుంచి ప్రశాంత్ కు సపోర్ట్ ఇస్తూ.. వచ్చాడు. ఇక ప్రశాంత్ కెప్టెన్ అయ్యేందుకు కూడా బాగానే కష్టపడ్డాడు.

అలా ప్రశాంత్.. శివాజీ టీమ్ లో చేరాడు. ఇక నెక్ట్స్ యావర్ కి కూడా సపోర్ట్ ఇచ్చి.. తనను కూడా తన టీములో చేర్చుకున్నాడు. ఇక శివాజీ టీమ్ లో యావర్, ప్రశాంత్ ఉండగా... ఇప్పుడిప్పుడే బోలేకి ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాడు. బోలేకి కొన్ని మాటలు చెప్తూ.. మొత్తానికి బోలే శివాజీ టీమ్ లో చేరాడు. నామినేషన్స్ లో బోలేకు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.
ఇక ఆ విషయం పక్కన పెడితే... రతికా రోజ్ మొదట శివాజీ బ్యాచ్ లోనే ఉండేది. ఇక ప్రశాంత్ తో గొడవ కావడంతో.. అమర్ దీప్ బ్యాచ్ లో చేరింది. సీరియల్ బ్యాచ్ లో చేరాక... ఆమె మరింత రెచ్చిపోయి.. ప్రశాంత్ ను టార్గెట్ చేసింది. ఇక అమర్ దీప్ తో కలిసి ప్రశాంత్ పవర్ అస్త్ర గేములో పాల్గొన్నప్పుడు.. మరింత రెచ్చిపోయి మాట్లాడింది. ఇక నెగిటివిటీ మూటగట్టుకుని ఎలిమినేట్ అయిపోయింది.
ఇక 7వ వారంలో రతికా రోజ్... మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఇక రావడం రావడమే... శివాజీ కాల్లు మొక్కి క్షమాపణలు చెప్పింది. ఇక బయట శివాజీకి ఉన్న క్రేజ్ చూసి రతికా రోజ్ ఆ టీములో చేరిందని నెటిజన్స్ అంటున్నారు. రతికా రోజ్ సారీ అన్నా... అంటూ శివాజీకి ఐస్ పెట్టడం.. శివాజీ కూడా పర్లేదు బిడ్డా అంటూ దగ్గరకు తీసుకోవడం.. ఇదంతా ఇద్దరి గేముల్లో భాగమే. ఇక రతికా రోజ్ ఎంటర్ అవ్వడం.. ప్రశాంత్ కాసేపు ఆగి రసగుల్లతో స్వాగతం చెప్పాడు.

ఇక రతికా రోజ్ ఎంట్రీతో శివాజీ టీమ్ లో మరో విద్యార్థి చేరిందని అంటున్నారు నెటిజన్స్. ఇక అమర్ దీప్ ను టార్గెట్ చేస్తూ ఉండే శివాజీ... ఇప్పుడు తన టీమ్ తో సీరియల్ బ్యాచ్ ను ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. అయితే శివాజీ మైండ్ గేములో మరో విద్యార్థి బలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











