బిగ్ బాస్‌కే షాకిచ్చిన హీరో శివాజి.. 8వ సీజన్‌పై సంచలన నిర్ణయం ఎందుకంటే!

ప్రతి భాషలోనూ టెలివిజన్ రంగానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ, కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోయేలా ఆదరణను అందుకుంటాయి. ఇండియాలో అలా సెన్సేషన్ అయిన షోనే బిగ్ బాస్. ఎవరూ అనుకోని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. ముఖ్యంగా తెలుగులో ఈ కార్యక్రమం అద్భుతమైన స్పందనతో సత్తా చాటింది. ఫలితంగా ఇది దేశంలోనే టాప్‌ షోగా మారింది. ఇక, త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో శివాజి బిగ్ బాస్‌కే షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

ఆ హీరోలు సక్సెస్ చేశారు
ఎన్నో అనుమానాల నడుమ బిగ్ బాస్ షో తెలుగులోకి వచ్చింది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో దాన్ని నాని, ఆ తర్వాత నుంచి నాగార్జున దీన్ని హోస్ట్ చేస్తున్నారు. వీటిలో అన్ని సీజన్లకూ ప్రేక్షకులు మంచి స్పందన అందించారు. దీంతో ఈ షో తెలుగులో చరిత్రను తిరగరాసే రేటింగ్‌ అందుకుంది. అదే సమయంలో దేశంలోనే టాప్ ప్లేస్‌కు సైతం చేరుకుని రికార్డు సాధించింది.

Hero Sivaji Rejects Bigg Boss Telugu 8 Buzzz Talk Show Host Offer

ఎనిమిదో సీజన్ వస్తోంది

అంతకు ముందు వచ్చిన సీజన్లు మంచి విజయాన్ని అందుకోవడంతో ఎనిమిదో సీజన్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను విడుదల చేశారు. అలాగే, శుక్రవారమే ఈ సీజన్ ప్రోమో కూడా వచ్చింది. మొత్తానికి ఎనిమిదో సీజన్ అతి త్వరలోనే రాబోతుందని యూనిట్ ప్రకటించింది.

అంతా క్లియర్... వాళ్లతో
బిగ్ బాన్ ఎనిమిదో సీజన్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టేందుకు నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు. దీన్ని అంతులేని వినోదంతో నడపబోతున్నారు. అంతేకాదు, ఇందుకోసం ఇప్పటికే బ్యాగ్రౌండ్ వర్క్, సెట్ పనులు, కంటెస్టెంట్ల ఎంపికలు సహా అన్నింటిని మొదలు పెట్టేశారు. ముఖ్యంగా ఈ సీజన్‌ కోసం చాలా మంది కాంట్రవర్శీ సెలెబ్రిటీలను తీసుకు వస్తున్నారు.

బిగ్ బాస్ బజ్ హోస్టు

బిగ్ బాస్ సీజన్ ప్రసారం అవుతోన్న సమయంలోనే 'బిగ్ బాస్ బజ్' అనే టాక్ షోను కూడా రన్ చేస్తున్నారు. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. గతంలో తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ రవి, యాంకర్ శివ, గీతూ రాయల్ వంటి వాళ్లు దీన్ని హోస్ట్ చేశారు. ఇప్పుడు 8వ సీజన్ కోసం ఎవరు వస్తారని అంతా వేచి చూస్తున్నారు.

శివాజికి బంపర్ ఆఫర్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో భాగంగా మొదలు పెట్టబోయే బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగా ఎవరు ఉంటారన్న దానిపై మొదట్లోనే ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఈ షోను శివాజి హోస్ట్ చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఆఫర్ రిజెక్ట్.. కారణం

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ బజ్ షోను శివాజినే హోస్ట్ చేస్తాడని అంతా ఫిక్సైపోయారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ టాక్ షో ఆఫర్‌ను అతడు రిజెక్ట్ చేశాడట. దీనికి కారణం గతంలో కంటే ఇప్పుడు శివాజికి ఎక్కువగా సినిమా ఛాన్స్‌లు రావడమేనని తెలుస్తోంది. ఆ కమిట్‌మెంట్ల వల్ల ఈ షో చేయడం కుదరదు అన్న ఉద్దేశంతోనే అతడు దీని నుంచి తప్పుకున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X