Sivaji Video: నన్ను పక్కనపెట్టి వాడికి కప్ ఇచ్చారు?.. బిగ్‌బాస్ యాజమాన్యంపై శివాజీ సంచలన వీడియో
బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ కంటే... తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ షో డిసెంబర్ 17న ముగిసింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకోగా.. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ నిర్వాహకులు కావాలనే ప్రశాంత్ ను గెలిపించి.. శివాజీని మోసం చేశారంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మొదటి సారిగా బిగ్ బాస్ ఓటమి అనంతరం శివాజీ ఓ వీడియో ద్వారా స్పందించాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 ఎట్టకేలకు ముగిసింది. డిసెంబర్ 17న అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఇక ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ గెలిచాడు. అయితే అందరూ శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని మొదటి నుంచి అనుకున్నారు. కానీ శివాజీని కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన పల్లవి ప్రశాంత్ ను విజేతగా ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీని కాదని బిగ్ బాస్ మెనేజ్మెంట్ పల్లవి ప్రశాంత్ కు టైటిల్ విజేతను చేసిందని అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా హీరో శివాజీ స్పందించాడు. బిగ్ బాస్ ఓటమి తర్వాత తొలిసారిగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు శివాజీ. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులను... తనకి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున, బిగ్‌బాస్ కి కృతజ్ఞతలు అంటూ చెప్పుకువచ్చాడు.

ఇక ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ... బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను పక్కనబెట్టి పల్లవి ప్రశాంత్ ను విజేతను చేశారని కామెంట్స్ వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు... అంటూ వెల్లడించాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను తాను నమ్మను అంటూ తెలిపాడు. బిగ్ బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే విజేతను ప్రకటించారని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ ను విజేతగా ప్రకటించారని ఆ వీడియోలో వెల్లడించాడు శివాజీ.

పల్లవి ప్రశాంత్ ను విజేతగా ప్రకటించడంపై తాను చాలా సంతోషించాను.. షో ప్రారంభంలో తాను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను అదే ఇప్పుడు జరిగిందని తెలిపారు. ఒక కామన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుటుందని భావించా... ఎందుకంటే నేను అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే అంటూ ఆ వీడియోలో తెలిపారు.
యావర్ కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడని శివాజీ అన్నాడు. అందుకే మాకు స్నేహం కుదిరిందని...చెప్పుకువచ్చాడు. గేమ్ ప్లాన్స్ ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తనకి మద్దతు తెలిపిన ప్రేక్షకులను త్వరలోనే కలుసుకుంటానని వెల్లడించాడు. ప్రస్తుతం శివాజీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











